Patanjali: పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై నిషేధం విధించిన సుప్రీంకోర్టు.. తప్పుడు ప్రకటనలు చేసినందుకు ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది. గతంలో ఆదేశాలిచ్చినప్పటికీ మళ్లీ యాడ్స్ ఇవ్వడంపై మండిపడింది. ఈ మేరకు పతాంజలి వ్యవస్థాపకులు బాబారామ్ దేవ్, బాలకృష్ణలకు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది. By B Aravind 27 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తులపై వస్తున్న యాడ్స్‌పై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది. పతంజలి యాడ్స్‌పై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు యోగా గురువు బాబా రామ్‌దేవ్, మేనిజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పతంజలి ఔషధ ఉత్పతుల యాడ్స్‌ను ఆపేయాలని ఆదేశించింది. అలోపతిపై తప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు(మంగళవారం) సుప్రీం ధర్మాసనం విచారించింది. Also read: రైతన్నలకు శుభవార్త…రేపే పీఎం కిసాన్ నిధులు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..! ఇలాంటివి సహించేది లేదు ఐఎంఏ (IMA) తరఫున సీనియర్ అడ్వకేట్ పీఎస్ పట్వాలియా వాదనలు వినిపించారు. యోగా చేయడం వల్ల పూర్తిగా డయాబెటీస్, అస్తమా వ్యాధులను పూర్తిగా నయం చేయొచ్చని పతంజలి సంస్థ తప్పుడు ప్రకటనలు చేసిందని కోర్టుకు వివరించారు. తప్పుదారి పట్టించే ప్రకటనలను సహించేది లేదని.. జస్టీస్ అమనుల్లా వ్యాఖ్యానించారు. గత ఏడాదే కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మళ్లీ ప్రకటనలు ఇవ్వడంపై ఆ ఆయుర్వేద సంస్థపై విమర్శలు గుప్పించారు. మూడు వారాల్లోగా కోర్టు ధిక్కరణ నోటీసులకు స్పందించాలని ఆదేశించారు. అప్పుడే హెచ్చరించిన సుప్రీం అయితే 2023లో కూడా పతంజలి సంస్థ తమ ఉత్పతులను వినియోగిస్తే.. డయాబెటిస్, ఆస్తమా లాంటి రోగాల నుంచి పూర్తిగా కోలుకోవచ్చని ప్రకటనలు చేసింది. దీంతో ఐఎంఏ (IMA).. పతాంజలి సంస్థ యజమానులపై మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తే.. ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటీ జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు పతంజలి సంస్థ యజమానులను హెచ్చరించింది. ఒకసారి వార్నింగ్ ఇచ్చాక కూడా మళ్లీ ఇలా తప్పుడు యాడ్స్ ఇవ్వడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ పీఎస్ పట్వాలియా కోర్టులో ఈరోజు (మంగళవారం) వాదనలు వినిపించారు. పతంజలి సంస్థ.. తమ ప్రొడక్ట్స్‌తో డయాబెటీస్, అస్తమా లాంటి వ్యాధులను పూర్తిగా నయం చేస్తామని ప్రకటలు చేసి నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. అసలు ఇలాంటి రోగాలను శాశ్వత ఉపశమనం అంటే ఏంటి అని పతంజలి సంస్థను ప్రశ్నించింది. డయాబెటీస్, రక్తపోటు, అస్తమా, ఉబకాయం లాంటి రోగాలను శాశ్వతంగా నయం చేస్తామని ఎలా చెప్పుకోగలరంటూ నిలదీసింది. అల్లోపతిని ప్రజల దృష్టిలో ఈ విధంగా దిగజార్చే స్థాయికి తీసుకురాకూదని వ్యాఖ్యానించింది. తప్పుదోవ పట్టిస్తున్న పతంజలి ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. Big breaking: Supreme Court imposes a COMPLETE BAN on Patanjali advertisements after SC comes down heavily upon Baba Ramdev and Patanjali for 'false and misleading' ads. Notice for contempt of court issued to Patanjali and Acharya Balakrishnan. Supreme Court comes down heavily… — Rajdeep Sardesai (@sardesairajdeep) February 27, 2024 Also Read: భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ట్రావెల్ వీసా #telugu-news #national-news #supreme-court #patanjali #patanjali-advertisements #baba-ram-dev మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి