Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కాగా కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
New Update

Supreme Court Grants Interim Bail To CM Kejriwal : ఢిల్లీ (Delhi) సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు (Supreme Court) లో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) జైలులోనే ఉండనున్నారు.

సీఎం కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని సుప్రీం పేర్కొంది. అతను దాదాపు 90 రోజులు జైలు శిక్ష అనుభవించారని చెప్పింది. ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 17న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఈరోజు కేజ్రీవాల్ కు ఉరటనిస్తూ మధ్యంతరం బెయిల్ ను మంజూరు చేసింది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు తిరిగి తమ వద్దకు వస్తున్నారని సంబరాలు జరుపుకుంటున్నారు.


Also Read : సీఎం రేవంత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు బీజేపీ కీలక నిర్ణయం

#delhi #supreme-court #cm-kejriwal #interim-bail
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe