Supreme court: చంద్రబాబు కేసులను వచ్చే నెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ములాఖత్ ను పెంచాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో ఇప్పుడు విచారణ అవసరం లేదని పిటీషన్ ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. దాంతో పాటూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల అంటే నవంబర్ 8కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం చెప్పింది.

Supreme court: చంద్రబాబు కేసులను వచ్చే నెల 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
New Update

చంద్రబాబు ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్ రెండు కేసుల విచారణనూ సుప్రీంకోర్టు వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో విచారణ జరగాల్సి ఉండగా...స్కిల్ స్కామ్ లో వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ ముగిసి.. తీర్పు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు జైల్లో చంద్రబాబు ములాఖత్ ఒకరోజుకు కుదించడం మీద ఆయన తరుపు న్యాయవాదులు వేసిన పిటిషన్ ఏసీబీ కోన్టు కొట్టేసింది. ప్రతివాదులు లేనందను విచారణ చేయలేమని చెప్పింది. దాంతో పాటూ సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్ పిటిషన్ ను 26వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనికి ఈనెల 26 వరకు సమయం కావాలని పీపీ అడిగింది. దీంతో ఈ కేసు విచారణను
26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

జైల్లోనే చంద్రబాబుకు దసరా, దీపావళి పండుగలు...

టీడీపీ అధినేత చంద్రబాబుకు కాలం కలిసి రావడం లేదు. నెలన్నర రోజులుగా రాజమండ్రి జైల్లోనే ఉంటున్న చంద్రబాబు ఇంకా చాలా రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేలా ఉంది. దానికి తోడు వరుసగా దసరా, దీపావళి పండుగలు రావడం, కోర్టులకు సెలవులు...ఇవన్నీ కూడా ఆయన విడుదలను మరింత వాయిదా వేస్తున్నాయి. దీంతో చంద్రబాబు దసరా, దీపావళి పండుగలు జైల్లోనే వెళ్ళనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు కేసులు వచ్చే నెల 8,9 లకు వాయిదా వేయడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు (Chandrababu) వేసిన ఎస్ఎల్పీ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP High Court) కొట్టేసింది. దాన్ని సవాలు చేస్తూ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న విచారణ ఈకేసు విచారణకు వచ్చినప్పుడు 18వ తేదీ వరకు ఉపశమనం ఇచ్చారు. తరువాత దాన్ని 17వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆరోజు కేసు వాదన వచ్చేటప్పటికి కోర్టు సమయం ముగియడంతో ఈ రోజుకు తిరిగి వాయిదా పడింది. ఈ కేసులో ధర్మాసనం విచారణ చేసే వరకు బాబును అరెస్ట్ చేయోద్దంటూ కోర్టు ఆదేశించింది. ఇది ఇప్పుడు నవంబర్ 8వరకు పొడిగించారు.

Also Read:కొనసాగుతున్న భీకర యుద్ధం..బలౌతున్న సామాన్య పాలస్తీనియన్లు

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 17ఏ మీద బాబు తరుపు న్యాయవాదులు వేసిన ఇరు పక్షాల లిఖిల పూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఈరోజే ఆఖరి రోజు. ఈ కేసులో మంగళవారమే వాదనలు ముగిసినా లిఖిత పూర్వక వాదనల కోసం తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ వాదనలు సమర్పిస్తే అవి చదివి నవంబర్ 9న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం ఈ రోజు చెప్పింది.

#tdp #chandrababu #supreme-court #hearing #cases
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe