Rajinikanth Jailer Movie : దుమ్ము దులుపుతున్న రజనీకాంత్ ఎట్టకేలకు మళ్లీ స్వింగ్‌లో కొచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. వరుస ఫ్లాపుల తర్వాత ఈ హీరో నటించిన జైలర్ సినిమా, సూపర్ హిట్టయింది. ప్రస్తుతం అన్ని సెంటర్స్‌లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముందుగా తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ హీరో, ఆ తర్వాత ఓవర్సీస్‌లో, అట్నుంచి అటు టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. By Vijaya Nimma 14 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి Rajinikanth Jailer Movie: భోళాశంకర్ ఫ్లాప్ అవ్వడం, టాలీవుడ్‌లో జైలర్‌కు బాగా కలిసొచ్చింది. భోళాశంకర్‌కు చెందిన ఎన్నో స్క్రీన్స్‌ను జైలర్‌కు కేటాయించారు. సేమ్ టు సేమ్ సీన్ ఓవర్సీస్‌లో కూడా రిపీటైంది. యూఎస్ఏలో కూడా భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే, ఆదివారం రోజున ఆ సినిమాకు కేవలం 15 వేల డాలర్లు వచ్చాయి. దీంతో భోళాశంకర్‌కు (Bhola Shankar) కేటాయించిన చాలా స్క్రీన్స్‌కు జైలర్‌కు అప్పగిస్తున్నారు. ఇక వసూళ్ల విషయానికొస్తే.. ఆదివారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 322 కోట్లు (అన్ని భాషల్లో కలిపి) గ్రాస్ వచ్చింది. తమిళనాడు నుంచి జైలర్ సినిమాకు 95 కోట్ల రూపాయలొచ్చాయి. ఈ రోజు ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి జైలర్ సినిమాకు 32 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. కేరళ నుంచి 23 కోట్లు, కర్నాటక నుంచి 32 కోట్లు, ఓవర్సీస్ నుంచి 16 మిలియన్ (రూ.132 కోట్ల) డాలర్ల వసూళ్లు వచ్చాయి. అలా విడుదలైన ప్రతి చోట జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ రన్ ముగిసేనాటికి కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా జైలర్ మూవీ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. రజనీకాంత్ (Rajinikanth) గట్టి హిట్టిచ్చి ఐదేళ్లు దాటింది. అతడు నటించిన 2.O సినిమా 2018లో రిలీజైంది. ఆ మూవీ తర్వాత సాలిడ్ హిట్ అందించలేకపోయాడు సూపర్ స్టార్. అతడితో సినిమాలు తీసిన దర్శకులంతా, రజనీకాంత్ మేనరిజమ్స్, స్టయిల్, ఫ్యాన్ బేస్‌పై ఆధారపడి సినిమాలు తీశారు తప్ప, మంచి కథను చెప్పలేకపోయారు. అందుకే ఫ్లాపులు తప్పలేదు. అలా 2019లో పేట, 2020లో దర్బార్, 2021లో పెద్దన్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఈ ఐదేళ్లలో రజనీకాంత్ మార్కెట్ కూడా టాలీవుడ్‌లో అమాంతం పడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెల్సన్ చెప్పిన స్టోరీలైన్‌కు ఓకె చెప్పారు రజనీకాంత్. అదే జైలర్ సినిమా (Jailer Movie). ఇందులో కూడా రజనీకాంత్ ఉన్నారు, ఆయన స్టయిల్ ఉంది. మేనరిజమ్స్ కూడా ఉన్నాయి. కానీ నెల్సన్ వీటితో పాటు కథను కూడా నమ్ముకున్నాడు. అందుకే సాలిడ్ హిట్ కొట్టాడు. మిగతా దర్శకుల్లా రజనీకాంత్‌కు హీరోయిన్‌ను పెట్టాలి, డ్యూయట్స్ పెట్టాలని అనుకోలేదు నెల్సన్. ఇంకా చెప్పాలంటే, ఆయన వయసుకు తగ్గ కథ, క్యారెక్టరైజేషన్‌ను రాసుకున్నాడు. అదే ఇప్పుడు ఇంతపెద్ద విజయాన్నందించింది. కాలంతో పాటు హీరోలు కూడా మారాలంటారు. దీనికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది జైలర్ సినిమా. Also Read: గుంటూరు కారం.. లిరికల్ వీడియో రెడీ అవుతోంది #jailer-movie #superstar-rajinikanth #hit #bhola-shankar #jailer-movie-collections #rajinikanth-movie-jailer #rajinikanth-movie-jailer-collections #rajinikanth-jailer-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి