Sunitha William : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది. వారిద్దరూ జూన్ 5న బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 13 రోజుల అంతరిక్ష యాత్రకు వెళ్లారు.. కానీ 2 నెలల తర్వాత కూడా వారు తిరిగి రాలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి స్టార్‌లైనర్ కాకుండా ఇతర ఆప్షన్లను నాసా పరిశీలిస్తోంది. అందువల్ల, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల పునరాగమనం కోసం మరికొన్ని నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.స్టార్‌లైనర్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావడానికి అన్ని ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు నాసా తెలిపింది.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, వెటరన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా బయలుదేరి జూన్ 22న షెడ్యూల్ ప్రకారం జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు ఇప్పటికే భూమికి తిరిగి వచ్చి ఉండాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల లోపంతో ల్యాండింగ్ ఆలస్యమైంది.ఈ సందర్భంలో, సునీత విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బరువు తగ్గడం, కండరాలు ఎముకల సాంద్రత తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read:Andhra Pradesh: ఏపీ టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం..వారికే నామినేటెడ్ పోస్టులు..!