Delhi CM : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ భార్య సునీత?

ఢిల్లీకి కాబోయే సీఎం కేజ్రీవాల్ భార్య సునీత అంటూ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎంగా సునీత పదవిని చేపట్టేందుుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఎవరి అభిప్రాయలను పట్టించుకోకుండా ఏకపక్షంగా సీఎం పదవిని చేపట్టేందుకు సునీత రెడీ అవుతున్నట్లు చెప్పారు.

New Update
Delhi CM : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ భార్య సునీత?

Kejriwal's wife Sunita as Delhi CM?:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తన భర్త పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా సునీత ఏకపక్షంగా సీఎం పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. దాణా కుంభకోణంలో లాలూ జైలుకు వెళ్లినప్పుడు బీహార్ లో సీఎంగా రబ్రీదేవిని ఇలాగే చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన కుర్చీలో కూర్చునేందుకు సునీతా మాత్రమే వీడియోలను షేర్ చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ గుర్తు చేశారు. లిక్కర్ ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడకుండా అన్నాహజారే ఉద్యమం సమయంలో గొంతు చించుకున్న అరవింద్..ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాక డబ్బుల మాయలో పడి జైలుపాలయ్యారని తెలిపారు.

అటు లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) లో అరెస్టయిన ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ప్రస్తుతం ఈడీ(ED) కస్టడిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal) మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాటం చేస్తున్నారని.. ఇందుకోసం ఆయనకు అండగా నిలబడేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. అంతేకాదు ఓ వాట్సప్‌ నెంబర్‌ను కూడా షేర్‌ చేసి దీనికి మీ సందేశాలు పంపిచండని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు..దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!

‘ నా భర్త అసలైన దేశభక్తుడు. కోర్టులో నిజాలను బయటపెట్టాలంటే చాలా ధైర్యం అవసరం. ఇప్పుడు దేశంలో ఉన్న నియంత శక్తులకు సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతం మనమందరం ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు నుంచి మేము ఓ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించనున్నా. అరవింద్ కేజ్రీవాల్‌ కోసం 8297324624 వాట్సప్‌ నెంబర్‌కు మీ సందేశాలు పంపించండి. అవన్నీ కూడా నేను ఆయనకు చేరవేరుస్తాను. మీరు చూపించే ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారని’ సునిత వీడియో సందేశంలో వివరించారు.

ఇదిలా ఉండగా.. లిక్కర్‌ పాలసీకి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతితో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతో మాత్రమే తనను అరెస్టు చేశారని అన్నారు. అలాగే సునీత కేజ్రీవాల్‌ కూడా నిన్న కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం బాలేదని.. అలాగే ఈడీ అధికారులు కూడా ఆయనను వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు

Advertisment
Advertisment
తాజా కథనాలు