Suhasini: అటు తెలుగు ఇటు తమిళ్ లో సీనియర్ నటి సుహాసిని (Suhasini Maniratnam) గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించినప్పటికీ సుహాసిని తమిళమ్మాయి. ఆమె సీనియర్ యాక్టర్ చారు హాసన్ కూతురు, కమల్ హాసన్(Kamal Hasan) అన్న కుమార్తెగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ..ఆమె టాలెంట్ , నటన, అందంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
ఆ తరువాత స్టార్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam)ను ప్రేమ వివాహం చేసుకుని సుహాసిని మణిరత్నంగా మరోసారి తెరమీదకు వచ్చింది. వివాహం అయిన తరువాత కూడా సుహాసిని సినిమాలను ఆపలేదు. ఇప్పటికీ ఆమె స్టార్ హీరోలకు తల్లి పాత్రలు చేస్తూ తెర మీద మెరుస్తున్నారు. అంతే కాకుండా అటు మణిరత్నం సినిమాలకి కూడా ముఖ్య సలహాలు , సూచనలు ఇస్తూ పరెఫెక్ట్ ఇల్లాలిగా పేరు తెచ్చుకుంది.
అయితే ఎన్నో సంవత్సరాల తరువాత సుహాసిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని విశేషాలను, కెరీర్ ప్రారంభంలో జరిగిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) ఆమెకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ఆమె చెప్పుకొచ్చారు. మొదట్లో ఆయనను చూసి విలన్ అనుకున్నట్లు చెప్పి అందర్ని షాక్ కు గురి చేసింది.
కెమెరా అసిస్టెంట్..
మంచు పల్లకి కన్నా ముందు కాళీ అనే తమిళ్ సినిమాలో చిరంజీవి నటించినప్పుడు సుహాసిని ఆ సినిమాకి కెమెరా అసిస్టెంట్ గా చేశారు. అప్పుడే కొత్తగా పెళ్లి అయ్యింది. ఓ మూలాన కూర్చొని ఉన్నారు. నేను సినిమా సెట్ లో ఉన్న కొందర్ని ఆయన ఎవరూ అని అడిగితే..తెలుగాయన..తమిళ్ అంత పెద్దగా రాదు అని చెప్పారు.
నేను వెళ్లి మాట్లాడేదాన్ని..అప్పుడు నాకు తెలియదు..నేను హీరోయిన్ అవుతాను అని, ఆ తరువాత నా రెండో చిత్రం చిరంజీవి గారితో చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. తమిళ్ ఫిల్మ్ అది. ఆ సినిమాలో ఐదుగురులో హీరోలు..లేడీ ఓరియెంటెడ్ సినిమా..అందరికీ సమానమైన పాత్రలు.
మా ఇద్దరికీ గొడవ..
ఆ సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరికీ గొడవ. నాకు కొంచెం పొగరు ఉంది అని అనుకునే వారు. నాకు కెమెరా వేసిన అమ్మాయి. ఇప్పుడొచ్చి నా పక్కన హీరోయిన్ ఏంటి..? అని ఆయనతో మాట్లాడిన మాటలు కూడా నాకు గుర్తు ఉన్నాయి. ఓ సారి ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఉన్నాం. ఏ హోటల్ వేశారు అన్నారు.
హెల్ప్ చేస్తా అని చెప్పకుండా..
నేను హోటల్ పేరు చెప్పి ..ఎన్ని రోజులు షూటింగ్ అంటే 30 నుంఇ 35 అని చెప్పగానే..ఉన్నన్ని రోజుల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే..నా దగ్గరకి మాత్రం రాకు..నీది నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి పడుకున్నారు. మళ్లీ ఆయన లేచింది హైదరాబాద్ లోనే. నేను షాక్ . నేను ఆ సమయంలో ఆయన గురించి ఏం క్యారెక్టర్ ఇయనది కనీసం హెల్ప్ చేస్తా అని చెప్పకుండా నీది నువ్వే సాల్వ్ చేసుకోవాలి అంటున్నారు
అలా మా రిలేషన్ షిప్ మొదలయ్యింది.
కమల్ ఎలాగో తెలుగులో చిరంజీవి అలా..
అదే సమయంలో నేను నటి సుమలత ఓ సినిమాలో నటిస్తుంటే అప్పుడు ఆమె చిరంజీవితో నటించడం గురించి అడిగారు. అప్పుడు ఆయన గురించి చెప్పుకొచ్చారు. తమిళ్లో కమల్ హాసన్ ఎలాగో తెలుగులో చిరంజీవి అలా అని..నేను వెంటనే చూడటానికి విలన్ లా ఉన్నారు గా అన్నా. ఆ విషయం ఆమె చిరంజీవి గారితో చెప్పారు.
అంతే తరువాత రోజు షూటింగ్ లో విలన్ తో ఎవరు యాకట్్ చేస్తారు అంటూ ఏడిపించారు. నువ్వు హీరోయిన్..నేను విలన్ అంతేనా అంటే..లేదు సార్ సారీ..సారీ అని చెప్పాను. అలా మా సినిమా ప్రయాణం మొదలయ్యిందంటూ ఆమె అలా చిరంజీవితో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి గారి మంచి మనసు ఎవరికి ఉండదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ , జాగింగ్ రెండింటిలో ఏది మంచిదంటే!