Ambajipeta Marriage Band OTT Release: దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ (Suhas) నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ యాక్షన్ డ్రామాగా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే బజ్ తో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలోఉన్నట్లుగా తెలుస్తోంది. కలర్ ఫోటో (Color Photo Movie), రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా సక్సెస్ అయిన సుహాస్ కు ఈ సినిమాతో మరి హిట్ దక్కింది.
ఓటీటీ రిలీజ్
ఇక ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుండగానే.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ అయినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. మార్చి 1న నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురావాలని ఆహా భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయం పై ఆహా (Aha) నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ లవ్ స్టోరీస్
ఈ సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, GA2 పిక్చర్స్, బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సుహాస్ సరసన శివాని నగరం కథానాయికగా నటించింది. జగదీశ్ ప్రతాప్, గోపరాజు రమణ, స్వర్ణకాంత్, నితిన్ ప్రసన్న, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ గా వాజిద్ బేగ్ పని చేయగా.. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ స్టోరీ
హీరో సుహాస్ (మల్లికార్జున) బార్బర్ అలాగే మ్యారేజ్ బ్యాండ్ లోనూ పని చేస్తూ ఉంటాడు. మల్లికార్జున సోదరి పద్మావతి (శరణ్య) ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. ఇదే గ్రామంలోని వెంకట్( నితిన్ ) పద్మావతి మధ్య ఏదో సంబంధం ఉందంటూ ఊర్లో అందరు అనుకుంటారు. ఈ క్రమంలో పద్మావతి తమ్ముడు సుహాస్ వెంకట్ మధ్య గొడవలు మొదలవుతాయి. మరో వైపు సుహాస్.. వెంకట్ చెల్లి లక్ష్మీ (శివాని) ప్రేమిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.
Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!