Sudheer Babu Interview : టాలీవుడ్ (Tollywood) లో మహేష్ బాబు (Mahesh Babu) బావగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు (Sudheer Babu) విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలు కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపే ఈ హీరో గత కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఈ మధ్య సుధీర్ బాబు చేసే సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని హరోం హర సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు తన సినీ కెరీర్ కి సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు.
Also Read : అక్కినేని ఫ్యామిలీ ఈవెంట్ కి సమంత?
ఆ విషయంలో ఫెయిల్ అయ్యానేమో
మీరు చేసిన సినిమాలో తలకిందులైన సినిమా ఏది అనే ప్రశ్నకు సుదీర్ బాబు బదులిస్తూ.." ప్రేమకథా చిత్రమ్ తప్ప మిగతా సినిమాలన్నింటికీ డిసప్పాయింట్ అయ్యా. కమర్షియల్ గా ఆ సినిమాలు ఇంకా బెటర్ గా ఉండాల్సింది. వాటిని ఆడియన్స్ కి చేరువ చేయడంలో ఫెయిల్ అయ్యానేమో అనిపించింది. ముఖ్యంగా భలే మంచి రోజు, సమ్మోహనం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఈ సినిమాలన్నీ టెక్నికల్ గా బాగున్నా అనుకున్న రిజల్ట్ రాలేదు" అని అన్నాడు.
మహేష్ తో మల్టీస్టారర్
మహేష్ బాబుతో మల్టీస్టారర్ ఎప్పుడు? అని అడిగితే.." నేను కూడా దాని కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు మల్టీస్టారర్ (Multi Starer) గురించి మా మధ్య ఎలాంటి డిస్కషన్ జరగకపోయినా, ఏదో ఒకరోజు అది సాధ్యం కావచ్చు" అని చెప్పుకొచ్చాడు.