Mamata Banerjee : దూరదర్శన్ లోగో మారడం చూసి షాకయ్యా : మమతా బెనర్జీ

ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్‌ ఛానల్ లోగో కలర్ ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మార్చడంతో.. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దూరదర్శన్ లోగో కలర్ మారడం చూసి షాకయ్యాయని.. ఇది అనైతికం, చట్టవిరుద్ధమని అన్నారు.

Mamata Banerjee : దూరదర్శన్ లోగో మారడం చూసి షాకయ్యా : మమతా బెనర్జీ
New Update

Doordarshan : ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్‌ ఛానల్(Doordarshan Channel) లోగో కలర్(Logo Color) మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎరుపు రంగులో ఉన్న డీడీ న్యూస్‌ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మార్చారు. అయితే తాజాగా దీనిపై పశ్చి్మ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఎక్స్(X) వేదికగా స్పందించారు. ' దేశంలో సార్వత్రిక ఎన్నికలు(General Elections) జరుగుతున్న సమయంలో.. దూరదర్శన్ లోగో కలర్.. ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మారింది. దీన్ని చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇది పూర్తిగా అనైతికం, చట్టవిరుద్ధం అని' దీదీ అన్నారు.

Also Read: బీజేపీ మొరాదాబాద్ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ కుమార్ కన్నుమూత..!

ప్రస్తుతం దేశంలో ప్రజలు ఎన్నికలు మోడ్‌లో ఉన్నప్పుడు దూరదర్శన్ లోగో రంగు మార్చేందుకు.. ఇందుకు ఎన్నికల సంఘాం(Election Commission) ఎలా పర్మిషన్ ఇచ్చిందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. వెంటనే దూరదర్శన్ లోగోను మళ్లీ అసలు రంగులోకి మార్చేలా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. కాషాయ రంగుకు బీజీపీతో సంబంధం ఉందని.. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరైంది కాదని అన్నారు.

Also Read: కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్

#doordarshan #telugu-news #bjp #cm-mamata-banerjee
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe