IPL_2024 : శుభ్‌మన్‌గిల్ కు అరుదైన రికార్డ్..చిన్న వయసులోనే ఘనత నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్..రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ అరుదైన రికార్డ్ సాధించాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్‌లో 3000 పరుగుల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అవతరించాడు. By Manogna alamuru 11 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Youngest player Shubman Gill : శుభ్‌మన్ గిల్(Shubman Gill).. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్(Gujarat Titans Captain). చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్న భారత బ్యాట్స్‌మన్‌్లో ఇతను ఒకడు. ఇప్పటికే గిల్ పేరు మీద చాలానే రికార్డులు ఉననాయి. అసలు ఇంత యంగ్ ఏపజ్‌లోనే ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించడమే చాలా ఎక్కువ. దానికి తోడు ఒక రికార్డ్‌ను తన పేరు మీద లిషించుకున్నాడు ఈ ఛాంప్. ఐపీఎల్ 2024(IPL 2024) లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కుమధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌కు ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (72; 44 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపిస్తే.. ఇన్నింగ్స్ చివరలో రాహుల్ తెవాతియా (22; 11 బంతుల్లో 3×4), రషీద్ ఖాన్ (24 నాటౌట్; 11 బంతుల్లో 4×4) ఊహించని విజయాన్ని అందించారు. 24 ఏళ్ళకే రికార్డ్.. కెప్టెన్‌గా టీమ్‌ను గెలిపించడమే కాకుండా ఒక అరుదైన రికార్డ్‌ను కూడా తన ఖాతాలో జమ చేసుకున్నాడు శుభ్‌మన్‌గిల్. ఐపీఎల్‌లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్న అత్యంత చిన్న వయస్కుడిగా శుభ్‌మన్ గిల్ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఎవరి పేరు మీదనా లేదు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్‌దగ్గర గిల్ ఈ రికార్డు నెలకొల్పాడు. 24 ఏళ్ళ 215 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును అందుకున్నాడు. అంతకు ముందు విరాట్ కోహ్లీ 26 ఏళ్ళ 186 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును చేరుకున్నాడు. దీంతో పోలిస్తే శుభ్‌మన్ గిల్ ఇంకా చిన్న వయసులోనే చేసినట్టు అయింది. విరాట్ తర్వాతి స్థానాల్లో సంజూ శాంసన్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఉన్నారు. సంజూ 26 ఏళ్ల 320 రోజుల వయసులో, రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులో, రోహిత్ 27 ఏళ్ల 343 రోజుల వయసులో 3000 పరుగుల మైలురాయిని చేరారు. Also Read : SCR : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు! #cricket #shubman-gill #ipl-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి