Netaji Birthday : గాంధీ, నేతాజీ(Netaji Birthday) స్వతంత్ర పోరాటంలో ఇద్దరివీ రెండు దారులు. ఒకరు భారతదేశం(India) లోనే ఉండి అహింసాయుతంగా పోరాటం చేస్తే మరొకరు యుద్ధమే శరణం అంటూ బ్రిటీష్(British) వాళ్ళ గడగడలాడించారు. ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fouz) పేరుతో అప్పటి యువకుల్లో ఉత్సాహాన్ని నింపి స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోనించారు. చివరి వరకు దేవం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్(Subhas Chandra Bose) మరణం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో(Japan Radio) ప్రకటించింది. అయితే ఈ ప్రకటన మీద చాలా వాదనలు వినిపిస్తాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది. దీంతో భారత స్వాతంత్ర్య పమరయోధుడు నేతాజీకి జయంతి ఉంది కానీ వర్ధంతి లేకుండా పోయింది.
Also read : చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి
బోస్ జయంతిని పరాక్రమ్ దివస్(Parakram Diwas) గా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఒడిశాలో పుట్టిన నేతాజీ ముందు మానవసేవే మధనసేవ అంటూ వివేకానందుడి మార్గంలో పయనించారు. కానీ జలియన్వాలా బాగ్ ఆయనలో మార్పును తీసుకువచ్చింది. అప్పటి నుంచి పోరాటాల బాట పట్టారు. 11సార్లు జైలుకు వెళ్ళిన సుభాష్ చంద్రబోస్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఇవి.
1. జపాన్ సహాయంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తేవాలని నేతాజీ అనుకున్నారు. అయితే జపాన్రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడంతో ఆయన అనుకున్నది అవ్వలేదు. జపాన్ యుద్ధంలో ఓడిపోయిన మూడు రోజులకే విమానం కూలిపోయిన నేతాజీ చనిపోయారు.
2. నేతాజీ మరణం వెనుక అనేక వాదనలు ఉన్నాయి. ఆయనను న్టాలిన్ అరెస్ట్ చేయించి మంచూరియాలో జైల్లో ఉంచారని...నేతాజీ అక్కడే మరణించారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చెబుతారు.
3. ఇక షానవాజ్ విచారణ కమిటీ ముందు నెహ్రూ స్టెనోగ్రాఫర్ శ్యామ్ లాల్ జైన్ ఇచ్చిన వాంగ్మూలం మరొక వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. ఇందులో బ్రిటన్ ప్రధాని అట్లీకి నెహ్రూ లేఖ రాశారని...అందులో స్టాలిన్ సందేశం గురించి ఉందని చెప్పారు. ఆ లేఖలో బోస్ బతికే ఉన్నారని, రష్యా అదుపులో ఉన్నారని ఉందని తెలిపారు.
4. జపాన్‌లో రింకోజి ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవేనని చెబుతారు. ఇవి ఇవ్వడానికి జపాన్ ఇప్పటికీ సిద్ధంగా లేదు. డీఎన్ఏ పరీక్సలు చేయించడానికి కూడా అంగీకరించడం లేదు.
5. జాతీయ జెండాను చూసి ప్రతీ ఒక్కరూ అనే నినాదం జైహింద్. దీని రూపకర్త సుబాష్ చంద్రబోసే. ఆయనే అందించిన మరొక నినాదం...మీరు నాకు రక్తాన్నివ్వండి నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను..
6. ఇక నేతాజీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే...ఆయన ఆస్ట్రియా అమ్మాయి ఎమిలీని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. బోస్ ఆస్ట్రియాలో ఉన్నప్పుడు ఎమిలీ ఆయన దగ్గర టైపిస్ట్‌గా పనిచేసేవారు.
7. ఇద్దరి సిద్ధాంతాలు వేరువేరు అయినా గాంధీ, నేతాజీకి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. గాంధీకి జాతిపిత అనే బిరుదును ఇచ్చింది కూడా బోసే. అయితే గాంధీ పద్ధతులు కొన్నింటిని బోస్ తీవ్రంగా వ్యతిరేకించేవారు.
8. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నేతాజీ చేయని ప్రయత్నం లేదు. వారి నుంచి బారతదేశాన్ని తిరిగి సంపాదించుకోవడానికి శత్రుదేశాలతో సైతం చేతులు కలిపారు. చివరకు హిట్లర్ ను కలిశారని చెబుతారు.