హైదరాబాద్ నగరంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేగింది. జగద్గిరిగుట్టలోని సంజయ్ పురికి చెందిన శ్రీజ(16) తన స్నేహితురాళ్లు అయిన ఎల్లమ్మబండకు చెందిన అక్కా చెల్లెల్లు స్రవంతి(15), దీపిక (18) కలిసి నిన్న సాయంత్రం నుంచి వెళ్లగా.. వారు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో బాలికల తల్లిదండ్రులు తెలిసివారి ఇంటికి వెళ్లారని అనుకున్నారు. కానీ బాలికలు చీకటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లకు ఫోన్ చేసిన బాలికల జాడ కనుక్కోగా.. బంధువులు బాలికలు తమ ఇంటికి రాలేదని చెప్పారు.
దీంతో భయాందోళనకు గురైన బాలికల తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నుమోదు చేసుకున్న పోలీసులు సంజయ్ పురి, యల్లమ్మబండ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాలికలు ఫోన్‌ను ఉపయేగిస్తున్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు. పిల్లలు ఎక్కువగా ఎవరితో మాట్లాడి ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ఒకరు మేజర్ కాగా మరో ఇద్దరు 10వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
శ్రీజ, స్రవంతి, దీపికను ఎరైనా కిడ్నాప్ చేశారా.? వారి తల్లిదండ్రుల మీద ఎవరికైనా కోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి తల్లిదండ్రులను బెదిరించేందుకు బాలికలను కిడ్నాప్ చేశారా అనే కోణంలో సైతం విచారణ చేపట్టారు. మరోవైపు విద్యార్థులను వెళ్లిన ప్రాంతంలో గంజాయి గ్యాంగ్ ఎమైనా ఉందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.