Neet Student Suicide: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య..ఈ ఏడాదిలో 27 వ ఘటన రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. By Bhavana 28 Sep 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. యూపీకి చెందిన తన్వీర్ అనే యువకుడు నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. తన తండ్రి, సోదరితో కలిసి కోటాలోని కున్హాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తన్వీర్ పోయిన సంవత్సరం నుంచి కోటాలోనే ఉంటూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈ క్రమంలో తన్వీర్ బుధవారం రాత్రి తన ఇంట్లోని గదిలోనికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. సమయం చాలా అవుతున్నప్పటికీ కూడా తన్వీర్ బయటకు రాకపోవడంతో అతని అక్క తలుపు కొట్టింది. కానీ లోపలి నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో కంగారు పడిన ఆమె తండ్రికి విషయం తెలిపింది. దీంతో ఆయన తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా తన్వీర్ ఫ్యాన్ కి ఊరేసుకుని ఉన్నాడు. ఈ విషయం గురించి పోలీసులుకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోటాలో విద్యార్థులు ఒత్తిడి వల్లే వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే ఏకంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో కలిపి ఇప్పటి వరకు కోటాలో ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 27 కి చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంలో కేవలం కరోనా టైమ్ లో మాత్రమే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడలేదు. 2015 నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు చనిపోతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. స్టూడెంట్స్ ఎక్కువగా ఫ్యాన్లకు ఊరేసుకోవడంతో అన్ని హాస్టళ్లలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్ ను గుర్తించిన వెంటనే అన్ కాయిల్ అయ్యేలా వీటిని రూపొందించారు. అయినప్పటి కూడా విద్యార్థులు ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. #neet #rajasthan #student #kota #suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి