Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు

ఓ కుర్రాడు...కేవలం26 ఏళ్ళు. అతను మొదలెట్టిన పోరాటం బంగ్లాదేశ్ ప్రధాని పదవికే ఎసరు పెట్టింది. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని అంధకారం చేసింది.

New Update
Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు

Student Leader Nahid: బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్‌ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్రతరం అయి అక్కడి ప్రభుత్వాన్నే ఏకంగా కూల్చేశాయి. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి...దేశం వదిలి పారిపోయారు. దీనంతటికీ కారణం ఓ 26 ఏళ్ళ విద్యార్థి.

ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసే స్థయి ఆందోళనలు నిర్వహించిన ఆ కుర్రాడి పేరు నహిద్ ఇస్లామ్. ఇతను ఢాకా యూనివర్శిటీలో సోషియాలజీ స్టూడెంట్. జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు, ఉద్యమాలు ఇతను నహిద్ మొదలుపెట్టినవే. బంగ్లాదేశ్ జెండాని తలకు చుట్టుకుని ఇతను చాలాసార్లు మీడియాఓ కూడ నిపింఆడు. మొత్తం ఉద్యమాన్ని ఇతర విద్యార్ధులో కలిపి సమన్వయం చేశాడు. అయితే జూలైలోనే నహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే అక్కడ ప్రజలను ఆకర్షించింది. తర్వాత ఉద్యమం తుఫానుగా మారి ప్రభుత్వాన్నే కూల్చేసింది.

1998 సంవత్సరంలో ఢాకాలో నహిద్‌ జన్మించాడు. ఇతని తండ్రి ఓ టీచర్‌. నహిద్‌కు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు నఖిబ్‌. ఇతను కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.నహిద్ ఎప్పుడూ దేశంలో మార్పు రావాలని ఆకాంక్షించేవాడని నఖిబ్ చెప్పాడు. తన సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి.. స్పృహతప్పేలా హింసించారు. ఆ తర్వాత రోడ్డుపై పారేశారు. అయినా భయపడకుండా పోరాటాన్ని కొనసాగించాడని నఖిబ్ తెలిపాడు.

బంగ్లాదేశ్ అల్లర్లలో 300మంది దాకా మరణించారు. వీరిలో చాలా మంది విద్యార్ధులు. వీరందరూ యూనివర్శిటీల్లో చదువుతున్నారు. ఈ కారణంగానే ప్రధాని షేక్ హసీనా రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అయితే దీని తర్వాత కూడా నహిద్, అతని విద్యార్ధి బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడంలేదు. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌ చీఫ్‌ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి సంఘం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్‌ చెబుతున్నాడు.

Also Read: Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం

Advertisment
తాజా కథనాలు