JNU : ఎన్నికలకు ముందు జేఎన్‌యూలో ఏబీవీపీ - వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ..

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఈ గొడవ జరగగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

New Update
JNU : ఎన్నికలకు ముందు జేఎన్‌యూలో ఏబీవీపీ - వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ..

Student Groups Clash : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU) క్యాంపస్‌లో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణలు జరగడం కలకలం రేపింది. విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై సమావేశం జరిపారు. అయితే ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన గొడవ ఘర్షణగా మారింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘర్షణపై జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.

Also Read : జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్‌

2024 JNUSU ఎన్నికల కమిషన్ సభ్యులకు ఎన్నుకోవడానికి జరిగిన సమావేశంలో జరిగిన ఘర్షణపై లెఫ్ట్-అనుబంధ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(DSF) కీలక వ్యాఖ్యలు చేసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వేదికపైకి ఎక్కి కౌన్సిల్ సభ్యులు, స్పీకర్లతో గొడవకు దిగారని.. అలాగే యూజీబీఎంకి అంతరాయం కలిగించారని ఆరోపించారు. అయితే సోషల్ మీడియా(Social Media) లో ఇందుకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నారు. ఇందులో ఏబీవీపీ(ABVP), జేఎన్‌యూఎస్‌యూ(JNUSU) సభ్యులు నినాదాలుచేస్తూ వాదించుకోవడం కనిపిస్తోంది. పరిస్థితిని అదుపుచేసేందుకు అక్కడి భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Also Read : బ్యాంకులను అప్పుల ఊబిలో పడేసింది కాంగ్రెసే.. నిర్మలమ్మ సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు