Student Suicide: కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తట్టుకోలేక వైజాగ్‌లోని మధురవాడ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ (Sri Chaitanya Engineering College) విద్యార్థిని బలవన్మరణం చెందింది. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని లేఖలో రాసింది. ఈ ఘటన ఆలస్యంగా బయటకురావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగి గంటలు నడుస్తున్నా కాలేజీ యాజమాన్యం మాత్రం ఎటువంటి విరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతోంది. దీంతో కాలేజ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్ధిని లేఖ..
ఆత్మహత్య చేసుకోవానికి వాళ్ళే కారణమంటూ విద్యార్ధి సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. ఇప్పుడు ఆ లేఖ అందరిచేతా కంటతడిపెట్టిస్తోంది. నేను చనిపోవడానికి కాలేజ్‌లో సెక్సువల్ హెరాస్‌మెంటే (Harassment) కారణం నాన్న అంటూ లేఖ రాసింది విద్యార్థిని. లైగింకవేధింపులు జరుగుతున్నాయని ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు..కానీ వారిలో ఒకరే లైంగికంగా వేధిస్తుంటే ఎవరికి చెప్పను నాన్నా అంటూ రాసుకొచ్చింది. చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు.. నా ఫొటోస్ కూడా తీసుకొని బెదిరిస్తున్నారు నాన్నా. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిన టీచర్సే..విద్యార్థుల్ని లైగింక వేధింపులకు పాల్పడమని ఎంకరేజ్ చేస్తుంటే ఇంక ఎవరికి చెప్పాలి నాన్నా అంటూ లేఖలో రాసింది విద్యార్ధిని. నా ఒక్కదానికే కాదు..కాలేజ్‌లో చాలామంది అమ్మాయిలు నాలా బాధపడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక..అలా అని కాలేజ్‌కి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా..ఏం చేసినా మా ఫొటోస్ వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తాం అని బెదిరించారు నాన్నా..అందుకే ఇంక నాకు వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలుస్తుంది..ఆ పని నేనే చేస్తున్నాను..ఐ యామ్ రియల్లీ సారీ నాన్నా..నీకు ఒక మంచి కూతుర్ని కాలేకపోయినందుకు అంటూ సూసైడ్ నోట్‌లో రాసి మరీ చనిపోయింది.
కూతురు చనిపోయిన దుఃఖానికి తోడు, లెటర్‌లో విషయాలు చదివి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విద్యార్ధిని తల్లిదండ్రులు. కాలేజీ యాజమాన్యం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం మిగిలిన విద్యార్థినులను అయినా కాపాడండి అని వేడుకుంటున్నారు.
Also Read:బీహార్‌లో తేలిన కూటమి సీట్ల లెక్క..26 స్థానాల్లో ఆర్జేడీ, 9 కాంగ్రెస్