Lok Sabha Elections : ఇతర సిరాతో ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ముకేష్ కుమార్ చెరగని సిరాతో ఓటర్లు వేళ్లపై వారి ఇంటి దగ్గరే మార్కు చేస్తూ ఓటు వేయకుండా కుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండిచారు. చెరగని సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని స్పష్టం చేశారు. By B Aravind 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Andhra Pradesh : ఏపీలో చెరగని సిరాతో ఓటర్ల(Voters) వేళ్లపై వారి ఇంటి దగ్గరే మార్కు చేస్తూ ఓటు వేయకుండా కుట్ర జరుగుతోందని అంటూ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) ఖండిచారు. చెరగని సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని.. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని.. ఇంకెక్కడ ఉండదని తెలిపారు. Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. సొంతూళ్లకు పయనం ఈ సిరా ఎన్నికల సంఘం(Election Commission) వద్ద కాకుండా ఇతరుల దగ్గర ఉంటుందనేది తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Also read: ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి #telangana-news #lok-sabha-elections #mukesh-kumar-meena #chief-election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి