Patanjali: ఉత్పత్తులు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన పతంజలి ప్రజలను తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇచ్చినందుకు పతంజలి సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తుల తయారీపై ఇటీవలే లైసెన్స్ రద్దయింది. దీంతో ఆ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని తాజాగా పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. By B Aravind 09 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Patanjali Products: బాబా రామ్‌దేవ్‌కు (Baba Ramdev) చెందిన పతంజలి సంస్థ గత కొంతకాలంగా వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఈ సంస్థపై కేసు నమోదైంది. ఇప్పటికే పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో (Supreme Court) క్షమాపణలు కూడా చెప్పింది. అలాగే పేపర్‌లో కూడా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటనలు ఇచ్చింది. అయితే తాజాగా పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తయారు లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు పేర్కొంది. అలాగే ఆ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ స్టోర్లకు సూచనలు చేశామని తెలిపింది. Also read: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి వీటికి సంబంధించిన యాడ్స్‌ను కూడా ఉపసంహరించుకోవాలని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు వివరించింది. ఇదిలాఉండగా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమ ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్ ఇచ్చారని నిర్ధారణ అయిన నేపథ్యంలో పతంజలి సంస్థ గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే తమ 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. Also Read: కుండపోత వానలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం #telugu-news #national-news #patanjali #baba-ramdev #patanjali-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి