Health Tips : చీటికి మాటికి కోప్పడుతున్నరా.. ప్రమాదంలో పడ్డట్లే చీటికి మాటికి కోప్పడటం వల్ల తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. By B Aravind 01 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Stomach Ulcers : కోపం(Angry) రావడం అనేది ప్రతిఒక్కరికి సర్వసాధారణం. మరికొందరైతే చీటికీ మాటికి కోప్పడుతుంటారు. ఇలాంటి కోపం కారణంగా ఆరోగ్య నష్టమే జరుగుతుందని.. తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడితే.. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్(Gastric) సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో మెదడులోని రక్తనాళలు సంకోచిస్తాయి. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినేలా చేస్తుంది. అంతేకాదు విపరీతమైన కోపం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. దీనివల్ల అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. Also Read: నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే! అలాగే ఎక్కువ కోపం రావడం వల్ల గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇంకా తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. విపరీతమైన కొపం వల్ల బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke), పక్షవాతం వంటి ముప్పు కూడా పెరుగుతుంది. చాలా కోపంగా ఉండే వ్యక్తుల్లో డయాబేటీస్(Diabetes) వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు సోరియాసిస్, ఎగ్జిమా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే అనవసరమైన కోపాలను నియంత్రించుకోవడమే మేలు. Also Read: వేసవిలో ఈ కూరగాయ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? #telugu-news #national-news #health-tips #angry #anger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి