Stomach Heat: వేసవిలో అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. శరీరంలో నీరు లేకపోవడం, డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుంది. శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్లు, పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. కడుపులో వేడి ఉన్నప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.
ఎముకలలో నొప్పి:
కడుపులో వేడి కారణంగా ఎముకల్లో నొప్పి కనిపిస్తుంది. ఎందుకంటే వేసవిలో ఎముకల మధ్య తేమ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా నొప్పిగా ఉంటుంది. ఎముకలలో నీరు ఉండటం చాలా ముఖ్యం. కడుపులో వేడి ఉన్నప్పుడు ఈ నీరు తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.
పాదాలు, అరికాళ్లలో మంట:
శరీరంలో నీరు లేకపోవడం వల్ల పాదాలు, అరికాళ్లలో మంటలు వస్తాయి. నిద్రపోయే సమయంలో మంట మరింత పెరుగుతుంది. పాదాలలో మంట సమస్యను పట్టించుకోకపోతే అనేక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నోటి పూత:
నోటిపూత పదేపదే వస్తుంటే అది కడుపులో వేడికి సంకేతం కావచ్చు. పొరపాటున కూడా దీన్ని విస్మరించవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో వేడి పెరగడం, పైత్యం కారణంగా తరచుగా బొబ్బలు రావడం ప్రారంభమవుతాయని అంటున్నారు.
కడుపులో వేడి తగ్గాలంటే:
నీరు ఎక్కువగా తాగాలి. దోసకాయ, పుచ్చకాయ వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే తరచూ మజ్జిగ తాగాలని, పెరుగు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండాకాలం టీ, కాఫీల జోలికి పోకుండా ఉంటే మంచిదని అంటున్నారు. పచ్చి కూరగాయలు ఎక్కువగా తింటే కడుపులో వేడి తగ్గుతుందని, అంతేకాకుండా శరీరాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతాయని చెబుతున్నారు. వీలైనంత వరకు బయటి ఫుడ్స్ తినకుండా ఉండటమే ఉత్తమమని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రాజీవ్‌గాంధీ, సోనియా పెళ్లి వీడియో చూశారా..అయితే ఓ లుక్ వేయండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.