Stock Markets: భారీ నష్టాల తరువాత వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ మార్కెట్లు

ఎన్నికల కౌంటింగ్ రోజు రికార్డ్ నష్టాల్లో కూరుకుపోయిన దేశీ స్టాక్ మార్కెట్లు మర్నాటి నుంచే మళ్ళీ పుంజుకున్నాయి. ఈరోజు కూడా వరుసగా మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.

New Update
Stock Markets: భారీ నష్టాల తరువాత వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ మార్కెట్లు

Desi Stock Markets: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు కూడా లాభాలతో ప్రారంభం అయ్యాయి. దేశీ మార్కెట్లు పంజుకోవడంతో పాటూ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పరిస్థితులు అనుకూలించడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్ల లాభంతో 74,773 దగ్గర.. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకొని 22,717 దగ్గర ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.42 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎం అండ్‌ ఎం, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుంది అనే సంకేతాలు వస్తుండడంతో స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. దాంతో పాటూ అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిసింది. ఈరోజు ఆసియా-పసిఫిక్ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఎస్‌ అండ్‌ పీ 1.18 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.95 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 78.59 డాలర్ల దగ్గర ఉంది.

Also Read:Elections 2024 : ఎక్కడ ప్రచారం చేశారో అక్కడ ఓటమి.. మహారాష్ట్రలో పని చేయని మోదీ చరిష్మా

Advertisment
తాజా కథనాలు