దేశంలో కౌంటింగ్ ఫీవర్..ఎరుపెక్కిన స్టాక్ మార్కెట్

దేశంలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు నెమ్మదిగా డిక్లేర్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫుల్‌గా ఎరుపెక్కిపోయింది. ఉదయం నుంచి అల్లకల్లోలంగా ఉన్న మార్కెట్ మధ్యాహ్నానికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.

Stock Market Trends : స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకుంటుందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి?
New Update

ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ దేశీయ స్టాక్ మార్కెట్‌్లు గందరగోళంగా తయారయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ దిగజారాయి. ఉదయమే 2,000 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 5,000 పాయింట్ల వరకు కుంగింది. నిఫ్టీ సైతం దాదాపు 1,500 పాయింట్లకు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ఒక్కరోజు నమోదైంది. ఇది దాదాపు రూ.35 లక్షల కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఒక్క హెచ్‌యూఎల్‌ మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ 18%, పవర్‌ గ్రిడ్‌ 16%, ఎస్‌బీఐ 15%, ఎల్‌ అండ్‌ టీ 12%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 10%, టాటా స్టీల్‌ 9%, భారతీ ఎయిర్‌టెల్‌ 9%, టాట మోటార్స్‌ 9%, జేఎస్‌డబ్ల్యూ 8%, రిలయన్స్‌ 8% బజాజ్‌ ఫైనాన్స్‌ 8 శాతానికి పైగా కుంగాయి. మరోవైపు అదానీ గ్రూప్స్ స్టాక్స్ ఒక్కసారి కుప్పకూలాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఫలితాలు ఉండడంతో అదానీ గ్రూప్ షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో అదానీ పోర్ట్స్ షేర్లు ఏకంగా 20 శాతం క్షీణించాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80 శాతం, అదానీ పవర్‌ షేర్లు 19.76 శాతం, అంబుజా సిమెంట్స్ 19.20 శాతం పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 19.13 శాతం పడిపోయాయి. అదానీ టోటల్ గ్యాస్‌ 18.55 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 18.31 శాతం, ఎన్‌డీటీవీ 15.65 శాతం, ఏసీసీ 14.49 శాతం, అదానీ విల్మర్‌ 9.81 శాతం చొప్పున నష్టపోయాయి.

#down #bear #shares #stock-market
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe