SSMB29: మహేష్ - రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్నేళ్లు ఆగాల్సిందే?

రాజమౌళి - మహేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

SSMB29: మహేష్ - రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్నేళ్లు ఆగాల్సిందే?
New Update

SSMB29 Release Update: దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది? రాజమౌళి (S.S.Rajamouli) ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ జనాల్లో మరింత ఎక్కువైంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లు లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది.

Also Read : ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మంచు విష్ణు!

రిలీజ్ అప్పుడేనా?

రాజమోళి సెప్టెంబరులో ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణను మొదలుపెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని, ఈ రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించేలా రాజమౌళి సన్నాహాలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. అంటే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఇంకా మూడేళ్లు ఆగాలన్న మాట. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

#ss-rajamouli #ssmb29 #mahesh-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe