Sriya Reddy : యంగ్ బ్యూటీ శ్రియారెడ్డి(Sriya Reddy) స్టార్ హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేంత వరకూ ఆయనెవరో తనకు తెలియదంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రభాస్ హీరోగా వచ్చిన 'సలార్'(Salaar) మూవీలో 'రాధారమ' పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రియా.. రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తు్న్నట్లు తెలిపింది. అలాగే తన అప్ కమింగ్ మూవీస్ గురించి కూడా మాట్లాడుతూ.. పవన్ సరసన నటించబోయే 'ఓజీ'గురించి కూడా పలు విషయాలు ప్రస్తావించింది.
‘సలార్’ చిత్రంలో 'రాధారమ' పాత్రను పోషించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాత్ర ఎన్నో సవాళ్లు విసిరింది. ‘సలార్’ విజయం తర్వాత తనకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి' అని చెప్పింది. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా కీలకమైనదే. నిజంగా ‘ఓజీ’ ఒక అద్భుతమైన మూవీ. డైరెక్టర్ సుజిత్ ఎక్సాట్రార్డినరీ స్టోరీ రాశారని చెప్పింది. అలాగే పవన్ కల్యాణ్‌ను కలిసేంతవరకూ ఆయన పెద్ద స్టార్ హీరో అనే విషయమే తనకు తెలియదని, ఇంత ఫాలోయింగ్, పాపులారిటీ ఉందని ఎక్స్ పెక్ట్ చేయలేదని చెప్పింది.
ఇది కూడా చదవండి : WFI : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త టీమ్ సస్పెండ్.. ప్రకటించిన క్రీడా మంత్రిత్వ శాఖ
అలాగే ''ఓజీ'(OG) సినిమాలో అవకాశం దక్కించుకున్నాక.. ఎక్కడికి వెళ్లినా ‘మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు’ అని చాలామంది ఫ్యాన్స్ నాకు చెప్పారు. నిజంగా పవన్ ను దేవుడితో పోల్చడం నన్ను ఆశ్యర్యానికి గురిచేసింది. ఆయనకున్న విశేష ప్రజాదరణ నన్ను మంత్రముగ్గురాలిని చేసింది. సినిమా సెట్‌లో కలిసినప్పుడు పవన్ నాతో బాగా మాట్లాడారు. ఆయన మనసు చాలా మంచిది. పవర్‌స్టార్‌తో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ఇందులో నాది నెగెటివ్ రోల్ కాదు. కానీ, నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. అభిమానులతో కలిసి ఫస్ట్‌డే తొలి షో చూసేందుకు ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి. చివరగా ఒక నటిగా తనకు వైవిధ్యభరితమైన పాత్రల్లోనే నటించాలని ఉందన్నారు. ఇక జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా నటిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.