Sriya Reddy : యంగ్ బ్యూటీ శ్రియారెడ్డి(Sriya Reddy) స్టార్ హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేంత వరకూ ఆయనెవరో తనకు తెలియదంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్'(Salaar) మూవీలో ‘రాధారమ‘ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రియా.. రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తు్న్నట్లు తెలిపింది. అలాగే తన అప్ కమింగ్ మూవీస్ గురించి కూడా మాట్లాడుతూ.. పవన్ సరసన నటించబోయే ‘ఓజీ’గురించి కూడా పలు విషయాలు ప్రస్తావించింది.
పూర్తిగా చదవండి..పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్
శ్రియారెడ్డి స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఓజీ' మూవీకోసం పవన్ కల్యాణ్‌ను కలిసేంతవరకూ ఆయన పెద్ద స్టార్ హీరో అనే విషయమే తెలియదు. ఇంత ఫాలోయింగ్ ఉందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. దేవుడితో వర్క్ చేస్తున్నావని ఫ్యాన్స్ అంటుంటే ఆనందంగా ఉందని చెప్పింది.
Translate this News: