తిరుమల బ్రహ్మోత్సవాలలో కన్నుల పండుగగా గరుడసేవ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ స్వామి వారు అతి ముఖ్యమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. By Manogna alamuru 22 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజు గరుడోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. గురుడ వాహనం మీద శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. ప్రతీరోజు మూలమూర్తి ధరించే ఆభరణాలు మకరకంఠి, సహస్రనామ మాల, లక్ష్మీ కాసుల హారాలను గరుడసేవలో స్వామి వారికి అలంకరించారు. ఏడాది మొత్తంలో గరుడోత్పవం రోజున మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయి. గరుడ సేవలో పాలుపంచుకునేందుకు గ్యాలరీలో రెండు లక్షల మంది భక్తులు ఉన్నారు. ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.ఈ సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు.. దీంతో మాడ వీధులు గోవిందనామ స్మరణ తో మారుమోగాయి. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సేవలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి. హైదరాబాదుకు చెందిన సంతోశ్ బృందం పేర్ని నృత్యం, తిరుపతికి చెందన సుకన్య బృందం కృష్ణ తులాభారం, తెలంగాణకు చెందిన సి.హెచ్.ప్రశాంత్ బృందం ఒగ్గుడోలు ఆకట్టుకున్నాయి. #tirupathi #tirumala #devotees #brahmotsavalu #sirvaru #venkateswara-swami #garuda-seva మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి