Sri reddy- Byreddy : వైసీపీ (YCP) యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddhartha Reddy) తో నటి శ్రీరెడ్డి (Sri Reddy) కి పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. ఏపీ (Andhra Pradesh) లో శ్రీరెడ్డి సపోర్ట్ చేసిన వైసీపీ ఘోర ఓటమి మూటగట్టుకోవడంతో కొంతమంది నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ గతంలో చేసిన కామెంట్స్ పై కౌంటర్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టమని ఆమె స్వయంగా వెల్లడించిన వీడియోపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. ఏకంగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిని శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులోకి మాజీ సీఎం జగన్ ను కూడా లాగుతూ చాలా వల్గర్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోలు, మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. బైరెడ్డితో పెళ్లిపై క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది.
తెగించినోడికి తెడ్డే లింగం..
ఈ మేరకు శ్రీరెడ్డి మాట్లాడుతూ.. 'అంత ఖాలీగా ఉన్నారేంట్రా. ఏంటా మీమ్స్. మొన్నటిదాకా బీచ్ లో బట్టలూడదీసి తిరుగుతానని ఫేక్ ప్రచారాలు చేశారు. నా అఫిషియల్ పేజీలో ఆ మాటలు నేను మాట్లాడలేదు. నేను చేసిన పాత వీడియోలు, పోస్టులన్నీ అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్లకు నేను హాట్ కేకులా దొరుకుతాను. అంత అందగత్తెను ఏమీ కాదు. అయినా నామీద పడి ఏడుస్తున్నారు. ఇప్పడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గురించి నా గురించి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఆ అబ్బాయి నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నామంటున్నారు. నేనేదో సరదాకి బైరెడ్డి బావుంటాడు.. అలాంటి మొగుడు వస్తే బాగుంటుందని అన్నాను. కానీ నిజంగా నేనెప్పుడూ బైరెడ్డిని చూడటం కానీ, అతడితో ఫోన్‌లో మాట్లాడటం వంటివి చేయలేదు. అసలు బైరెడ్డి ఎక్కడుంటాడో కూడా నాకు తెలియనే తెలియదు. నా గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన పర్లేదు. నాకేమీ భయం లేదు. నాకు పెళ్లి కాదు అనే భయం కూడా లేదు. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్లు నా జీవితంలో అయింది చాలు. ఇంకా కావాల్సిందేమీ లేదు. కానీ బైరెడ్డి ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నాడు. రాజకీయంగా అతని మంచి జీవితాన్ని నాశనం చేయకండి. అతను చిన్న పిల్లోడు. బైరెడ్డికి నాకు ఎలాంటి పెళ్లి లేదు. రిలేషన్ షిప్ కూడా లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపండి. పనిలేకపోతే పని చూసుకోండి. వృద్ధాశ్రమాల్లో సేవలు చేసుకోండి. ఉన్నవి మాత్రమే మాట్లాడండి. రాజకీయంగా తీట్టుకోవడం ఒకే. కానీ అబద్ధాలు క్రియేట్ చేయొద్దు. థాంక్స్' అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : రేపటి నుంచి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా?