50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది.

New Update
50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

ఆసియా కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌ శ్రీలంక బ్యాటర్లలో మెండీస్‌ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశాయగా మిగతా బ్యాటర్లు వచ్చినట్లే వచ్చి వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు ఐదుగురు డకౌట్‌గా కావడం విశేషం. మరోవైపు భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అంతర్జాతీ క్రికెట్‌లో తన అత్యధిక గణాంకాలను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 6 వికెట్లతో చెలరేగగా, హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా 1 వికెట్‌ పడగొట్టాడు.

మ్యాచ్‌ ఆరంభంలో బూమ్రా మొదటి వికెట్‌ తీయడంతో శ్రీలంక పథనం ప్రారంభమైంది. బుమ్రా అనంరతం మహ్మద్‌ సిరాజ్‌ ఓకే ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. దీంతో లంక బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే ఫెవీలియన్‌ చేరుతుండటంతో శ్రీలంక టీమ్‌ పీకల్లతో కష్టాల్లో పడింది. ఆసమయంలో బ్యాటింగ్‌ వచ్చిన ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి 21 పరుగులు చోడించాడు. అనంతరం ఈ జోడీని ఆల్‌ రౌండర్‌ హార్డిక్ పాండ్యా విడదీశాడు. ఏడో వికెట్‌ కోల్పోయిన అనంతరం మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రత్యర్థిని 50 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో కొత్త రికార్డును సృష్టించింది. ఐసీసీ ర్యాంకింగుల్లో టాప్‌ 8 టీమ్‌లో ఒకటైన జట్టును కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేసిన టీమ్‌గా భారత్‌ నిలిచింది. కాగా మహేలా జయవర్దన. సనత్‌ జయసూర్య, కుమార సంగకార వంటి మేటి క్రికెటర్లు ఆడిన టీమ్‌ వన్డే ఫార్మాట్‌లో ఇలా తక్కువ పరుగులు చేయడంతో చెత్త రికార్డును సృష్టిచుకుంది. వన్డే ఫార్మాట్లో లంక టీమ్‌ క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ ఇంత తక్కువ స్కోర్‌ చేయలేదు. అలాంటి టీమ్‌ను భారత జట్టు అత్యంత అత్యల్ప స్కోర్‌ కే పరిమితం చేయడం విశేషం

Advertisment
తాజా కథనాలు