/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/24-jpg.webp)
NTR Death Anniversary: మాజీ ముఖ్యమంత్రి, నవరస నట సార్వభౌముడు ఎన్టీయార్ (N.T.Rama Rao) చనిపోయిన ఇప్పటికి 28 ఏళ్ళు గడుస్తోంది. రాముడుగా, కృష్ణుడుగా ఇప్పటికీ తెలుగు వారి చేత పూజలు అందుకుంటున్న ఎన్టీయార్ తెలుగు సినిమా బతికున్నంతకాలం చిరస్మరణీయుడుగానే మిగిలిపోతారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీయార్ 1996లో చనిపోయారు. అయితే ఆయన వారసులు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్టీయార్ లేని లోటును తీరుస్తూనే ఉన్నారు. సీనియర్ నటుడుగా బాలకృష్ణ (Balakrishna) ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తూనే ఉన్నారు. మరోవైపు వెర్శటైల్ యాక్టర్‌గా జూ. ఎన్టీయార్ పేరు తెచ్చుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ యాక్టర్‌గా కూడా పేరు సంపాదించాడు. ఇక ఎన్టీయార్ అన్నయ్య కల్యాణ్ రామ్ కూడా వరుస హిట్‌లతో దూసుకుపోతూ తాత పేరును నిలబెడుతున్నాడు.
Also Read:వైసీపీలో నాలుగో జాబితా మీద నేతల్లో టెన్షన్…ఇంకా కొనసాగుతున్న కసరత్తులు
బాలకృష్ణ నివాళి..
ఈరోజు ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ దగ్గర పూలమాలలతో ప్రత్యేక అలంకారం చేశారు. తెల్లవారుఝాము నుంచి ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఘాట్‌ను సందర్శిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి తండ్రికి నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటూ మరొ కొడుకు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.
ఎమోషనల్ అయిన జూ.ఎన్టీయార్..
నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఎన్టీయార్ మనవళ్ళు, యాక్టర్స్ అయిన జూ.ఎన్టీయార్ (Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) లు అయితే పొద్దుపొడవక ముందే ఘాట్ కు చేరుకుని తాతకు శ్రద్ధాంజలి ఘటించారు. జూ.ఎన్వీటీయర్రి తాతను తలుచుకుని కాస్తోత ఎమోషనల్ అయ్యారు. పాటూ పెద్ద ఎత్తున అభిమానులుకూడా అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఆ ప్రాంగంణం అంతా హడావుడిగామారింది.
జనని భారతి మెచ్చ..
జగతి హారతులెత్త..
జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..
రణభేరి మ్రోగించే తెలుగోడు..
జయగీతి నినదించే మొనగాడు... #NTR ♥️🙏స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 28 వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని స్మరించుకుంటూ.#JoharNTRpic.twitter.com/o0t4aY4qit
— NBK UPDATES (@NbkUpdates) January 18, 2024
Follow Us