Chahal: క్రికెటర్ చాహల్ సంచలనం.. భార్యకు విడాకులు..?

టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అదే సమయంలో ధనశ్రీతో ఉన్న అన్ని ఫొటోలను చాహల్ తొలగించాడు. దీంతో త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు కనిపిస్తోంది.

New Update
Chahal and Dhana shree divorce

Chahal and Dhana shree divorce

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన మాయాజాల స్పిన్‌తో ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో చాహల్ దిట్ట. ఐపీఎల్‌తో అతడి పేరు మారుమోగిపోయింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు మెగా వేలం గతేడాది చివర్లో జరిగింది. ఈ వేలంలో చాహల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18 కోట్ల ధరకు చాహల్‌ను దక్కించుకుంది. దీంతో అతడి పేరు మారుమోగిపోయింది. 

2020లో లవ్ మ్యారేజ్

అయితే చాహల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతగా టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారిందో.. అతడి పర్సనల్ లైఫ్ కూడా దానికంటే మరింత చర్చనీయాంశమైంది. చాహల్ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రముఖ నటి, మోడల్, డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్‌ర్‌ ధనశ్రీని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అనంతరం ఈ జంట రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా జీవించింది. 

ఇది కూడా చూడండి:  96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

కానీ ఊహించని కొన్ని మార్పులతో వారి జీవితానికి శుభం కార్డులు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ లవ్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా గతంలో ధనశ్రీ పై ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. చాహల్ స్పందించే వాడు. కానీ ఇప్పుడు కనీసం రియాక్ట్ కావడం లేదు. 

ఒకరినొకరు అన్‌ఫాలో

ఇది కూడా చూడండి: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తాజాగా వీరి విడాకులకు సంబంధించిన మరిన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు తెలిసింది. అదే సమయంలో అన్‌ఫాలో అనంతరం చాహల్ తన అకౌంట్‌లో ధనశ్రీతో ఉన్న అన్ని ఫొటోలను తొలగించాడు. దీంతో ఈ జంట విడాకులు నిజమేనని నెటిజన్లు ఒక అంచనాకు వచ్చేశారు. 

2023లో మొదలు

ఇది కూడా చూడండి: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

కాగా వీరి విడాకులకు సంబంధించి వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో 2023లో ధనశ్రీ తన భర్త చాహల్‌ను అన్‌ఫాలో చేసినప్పుడు కూడా ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి. చాహల్ - ధనశ్రీ జంట విడాకులకు సంబంధించి రూమర్స్ రావడం అదే తొలిసారి. ఇక ఇప్పుడు మళ్లీ వీరి విడాకుల వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ విడిపోవడానికి ఈ జంట సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు