Yuzvendra Chahal : అధికారికంగా విడాకులు తీసుకున్న చాహల్-ధనశ్రీ!

స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారని కోర్టు వర్గాలు తెలిపాయి.

New Update
Yuzvendra Chahal wife Dhanashree Verma

టీమిండియా స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లుగా గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరు అధికారికంగా విడిపోయినట్లుగా తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు సమాచారం. 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదని... పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారని కోర్టు వర్గాలు తెలిపాయి.  విడిపోయాక ఒత్తిడి నుంచి బయటపడ్డాననే అర్థంలో ధనశ్రీ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం గమనార్హం. ఇలాంటిదే చాహల్ కూడా తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.  
నేను లెక్కించలేనన్ని సార్లు దేవుడు నన్ను రక్షించాడు. ఆ సమయాలను ఊహించగలను కానీ అవేంటో తెలియవు. ఎప్పుడూ నాతో ఉన్న దేవుడికి ధన్యవాదాలు. ఆమెన్ అని రాసుకొచ్చాడు.  

Also Read :  కొణిదెల అంజనదేవికి అస్వస్థత?

Also Read :  తొక్కిసలాట ఘటనలో భోలే బాబాకు క్లీన్ చిట్ !

Also Read :  తాజ్‌బంజారా హోటల్‌ సీజ్

18 నెలలుగా విడివిడిగా 

ధనశ్రీ, యుజ్వేంద్ర 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ధనశ్రీ, యుజ్వేంద్ర అస్సలు స్పందించలేదు. గత 18 నెలలుగా ఒకరికొకరు విడివిడిగా నివసిస్తున్నారని కూడా న్యాయమూర్తికి తెలిపారు.  ఇప్పుడు అధికారికంగా వీరు విడాకుల తీసుకున్నారనే వార్తలు రావడం గమనార్హం.   విడాకుల తర్వాత ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చాహల్ రూ.60 కోట్ల భరణం ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  

గత 2 సంవత్సరాలలో  టీం ఇండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్ళు విడాకులు తీసుకున్నారు. మొదటగా  శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడిపోయారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్నారు.  ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ కూడా విడిపోయారు. అయితే, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాడు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.  తన భార్య ఆర్తి అహ్లవత్ తో గత కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

Also Read :  ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సర్కార్

Advertisment
తాజా కథనాలు