నేటి నుంచి మహిళల పొట్టి కప్.. ఇక అమ్మాయిల వంతే!

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, మరో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.

SPORTS1
New Update

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళా టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రారంభం కానుంది. మహిళల పొట్టి కప్పు మ్యాచ్‌లు ఈరోజు నుంచి యూఏఈలో జరగనున్నాయి. అయితే మూడు నెలల కిందట రోహిత్‌ సేన పొట్టి కప్పు గెలవడంతో యావత్తు భారత్ ఆనందం చెప్పలేనిది. ఈ పొట్టి కప్పులో అమ్మాయిలూ కూడా అదరగొట్టాలని.. ప్రపంచకప్‌ కలను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇది కూడా చూడండి: నాగార్జున ఫ్యామిలీని రోడ్డుపైకి లాగడానికి కారణం అదే.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

కల నేరవేర్చుకోవాలని..

నేటి నుంచి మొదలుకానున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ ఢీకొంటున్నాయి. ఈ రోజు జరిగే ఇంకో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక దేశాలు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కాగా.. రెండో మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఒకసారి టీ 20 ఫైనల్, రెండుసార్లు వన్డేల్లో ఫైనల్ చేరిన కూడా అమ్మాయిలు జట్టు కప్పు కొట్టలేకపోయింది. ఆ కల ఈసారైన నెరవేర్చుకోవాలని భారత్ జట్టు భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: ఉదయాన్నే ఈ పదార్థాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఈసారి మ్యాచ్‌లో భారత్ జట్టు కల నెరవేర్చుకోవడానికి కాస్త కష్టపడాలి. ఎందుకంటే కొత్త ఫార్మాట్ అంత తేలిక కాదు. ఇండియాతో గ్రూప్‌-ఎలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి. ఆరుసార్లు ఛాంపియన్‌గా గెలిచిన ఆస్ట్రేలియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గ్రూప్‌ దశలో టాప్‌-2లో ఉండాలంటే.. భారత్ జట్టు నిలకడగా ఆడాలి. ఆస్ట్రేలియాతో పాటు మిగతా జట్లును ఢీకొనడం కూడా కాస్త కష్టమే. అయితే ఈసారి హర్మన్‌ప్రీత్‌, షెఫాలి, మంధాన, జెమీమా, రిచా లాంటి బ్యాటర్లు ఉండటంతో పాటు దీప్తి, పూజ, రేణుక, రాధ, అరుంధతి, ఆశలతో బౌలింగ్‌లోనూ జట్టు స్ట్రాంగ్‌గా ఉంది. 

ఇది కూడా చూడండి:  ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం

ఈ టీ20 ప్రపంచకప్‌‌కి మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లగా విడదీసి.. గ్రూప్‌ దశలో ప్రతి జట్టూ మిగతా ఉన్న నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశ అయ్యేసరికి మొదటి రెండు స్థానాల్లో ఏ జట్లు అయితే నిలుస్తాయో అవి సెమీస్‌కు చేరుతాయి. గ్రూప్‌-ఎలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్లు ఉన్నాయి. అయితే ఈ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా..అక్కడ ఆందోళనల కారణంగా యూఏఈకి మార్చారు. ఈ మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఇది కూడా చూడండి: ఓటీటీలో దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

#india #womens-t20-world-cup-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe