/rtv/media/media_files/2025/10/14/smriti-mandhana-2025-10-14-08-55-36.jpg)
Smriti Mandhana
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం స్మృతి మంధాన మహిళల టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లు ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మంధాన 66 బంతుల్లో 80 పరుగులతో చెలరేగింది. కానీ టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఇలా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ ఏడాది వెయ్యి వన్డే పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా కూడా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా కూడా నిలిచింది. వన్డేల్లో కేవలం ఆస్ట్రేలియాపైనే ఐదు లేదా అంతకంటే ఎక్కువ 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి బ్యాటర్‌గా ఆమె రికార్డు సాధించింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో స్మృతి మంధాన సిక్స్ ప్యాక్‌లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Smriti Mandhana : స్మృతి మంధాన ప్రపంచ రికార్డు..ఒకే ఒక్క క్రికెటర్
If this Six Pack Abs is not fake, Hats off to you #SmritiMandhana 🫡🫡
— Filmi Woman (@FilmiWoman) October 12, 2025
You are the Virat Kohli of Indian Women's Cricket 💞 pic.twitter.com/cFTwR31QEy
ఫేక్ ఫొటోలు అని..
స్మృతి మంధానకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన మంధాన టీ-షర్ట్‌ను పైకి ఎత్తి ముఖం తుడుచుకుంటున్నట్లు ఉన్న ఈ ఫోటోలో ఆమె కడుపుపై ఉన్న కండరాలు స్పష్టంగా కనిపించాయి. దీనిని చూసిన కొందరు నెటిజన్లు మంధానకు 'సిక్స్ ప్యాక్' ఉందని ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ ఫొటో ఫేక్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినట్లు ఈజీగా తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఏ మహిళా క్రికెటర్ కూడా ఇలా తమ టీషర్ట్ పైకెత్తి ఆబ్స్ చూపించరు. ఈ ఫొటోలో స్మృతి మంధాన చాలా ఫిట్‌గా సిక్స్ ప్యాక్‌తో ఉన్నారు. కానీ ఫేక్ అని తెలుస్తోంది.
NEW FITNESS FREAK 🔥🔥 IN TOWN
— Raj (@im_raj87) October 12, 2025
Six pack abs of Smriti Mandhana 🥵🔥 pic.twitter.com/5XjiH2dAi1
ఇది కూడా చూడండి: Women's World Cup: మళ్ళీ ఓడిన టీమ్ ఇండియా..వైజాగ్ లో ఆస్ట్రేలియా చేతిలో..