Ind Vs Nz : రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులోకి ఆల్ రౌండర్ ఎంట్రీ

న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్‌ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు పుణె వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టుతో కలవనున్నాడు.

New Update
washi

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కివీస్ పై ఎలాగైనా గెలవాలని పోరాడిన మన ఆటగాళ్లు.. చివరికి ఓటమిని ఛేదించలేకపోయారు. ముఖ్యంగా మ్యాచ్ లో ఐదో రోజు  భార‌త బౌల‌ర్లు రెండే రెండు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 8 వికెట్ల‌తో ఘన విజయం సాధించింది. ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం మిగిలిన రెండు టెస్టులు కచ్చితంగా గెలవాలి. 

Also Read : Ind Vs Nz: కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి బెంగాల్ బ్యాటర్!

అందుకే జట్టులో ఓ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో జరగనున్న మిగతా రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్‌ ను జట్టులోకి తీసుకున్నారు. రంజీ ట్రోఫీలో త‌మిళ‌నాడుకు ఆడుతున్న సుంద‌ర్ త్వ‌ర‌లోనే జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని బీసీసీఐ ఆదివారం సాయంత్రం వెల్ల‌డించింది. చివ‌రి రెండు టెస్టుల‌కు భార‌త్ 16 మంది బృందంతో కొన‌సాగ‌నుందని బోర్డు స్ప‌ష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: ఓపికగా ఆడలేరా.. గంభీర్ టీమ్‌పై మాజీలు ఫైర్.. పూజారా కావాలంటూ!

స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన వాషింగ్టన్ సుందర్ భారత్‌ తరఫున ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడాడు. బ్యాటింగ్‌లో  265 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సుందర్‌ (152; 269 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి: అన్‌స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు.. వీటిపైనే మాట్లాడేది!

న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ కు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్‌కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ , మహ్మద్‌ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.

ఇది కూడా చదవండి: భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు