/rtv/media/media_files/2025/02/02/Ae3UdXZW9qn8OUCe6MXm.jpg)
Virat Kohli rewards Railways pacer Himanshu Sangwan after Ranji Trophy match
విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటేనే క్రికెట్ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహం.. మొహం నిండా ఉత్తేజం. అతడు బ్యాట్ పట్టుకుని క్రీజులోకి దిగుతున్నాడంటే గ్రౌండ్ మొత్తం అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే విరాట్ కొద్ది రోజుల నుంచి ఫామ్ లో లేడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో కూడా పెద్దగా ఆట తీరు కనబరచలేదు.
12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్
దీంతో విరాట్ ఎప్పుడెప్పుడు మళ్లీ ఫామ్ లోకి వస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రంజీ ట్రోఫీలో విరాట్ దర్శనమిచ్చాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో చాలా మంది విరాట్ ను చూసేందుకు స్టేడియంకు పరుగులు తీశారు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
6 పరుగులకే ఔట్
సూరజ్ అహుజా రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అదరగొడతాడని అంతా ఊహించారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. మొదట ఫోర్ కొట్టడంతో స్టేడియంలోని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. కానీ ఆ తర్వాత ఔటయ్యాడు. కేవలం 6 పరుగులకే వెనుదిరగడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. రైల్వేస్ బౌలర్ హిమాన్షు సంఘ్వాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
బౌలర్ పై ప్రశంస
Himanshu Sangwan gets ball signed by Virat Kohli❤️#ViratKohli | #RanjiTrophy pic.twitter.com/fu6FK9E2R9
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) February 2, 2025
దీంతో విరాట్ అభిమానులు ఆ బౌలర్ పై ఫైర్ అయ్యారు. తమ అభిమాన క్రికెటర్ ను ఔట్ చేస్తావా? అంటూ సోషల్ మీడియాలో నెగెటివ్ గా కామెంట్లు చేశారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం హుందాగా ప్రవర్తించాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత హిమాన్షు సంఘ్వాన్.. విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లాడు. అక్కడ విరాట్ అతడిని ఎంతో ప్రశంసించాడు.
అద్భుతమైన బంతిని వేశావని ఆ బౌలర్ ను విరాట్ కొనియాడాడు. అంతేకాకుండా ఆ బౌలర్ వేసిన బాల్ పై తన ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది విరాట్ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.