Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ గూస్‌బంప్స్ వీడియోస్.. చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..!

టీమిండియాకు విరాట్ కోహ్లీ బిగ్ షాక్ ఇచ్చాడు. టెస్టు ఫార్మట్‌లకు అఫీషియల్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక నోట్ రిలీజ్ చేశాడు. దీంతో అభిమానులు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు సంబంధించిన వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

New Update
Virat Kohli Retirement

Virat Kohli Retirement

టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు విరాట్ కోహ్లీ బిగ్ షాక్ ఇచ్చాడు. టెస్టు ఫార్మట్‌లకు అఫీషియల్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఒక నోట్ రిలీజ్ చేశాడు. తాను 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణమని కోహ్లీ అన్నాడు. తాను ఎప్పుడూ తన టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని తెలిపాడు. 

Virat Kohli Retirement

ఇక రోహిత్ శర్మ సైతం ఇటీవలే తన టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడు అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతుంది. కాగా కోహ్లీ ఇదివరకే టీ20 ఫార్మట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కోహ్లీ రిటైర్మెంట్‌తో అతడికి సంబంధించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ టెస్ట్ సిరీస్‌లలో దుమ్ము దులిపేసిన వీడియోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 

virat-kohli | test-cricket | india-test-cricket | latest-telugu-news | telugu-news

Advertisment