డకౌట్‌లో తిరుగులేని వీరులు.. కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు!

న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ చెత్త రికార్డులను నెలకొల్పుతోంది. కివీస్ బౌలర్ల దెబ్బకు 46 పరుగులకే కుప్పకూలగా.. 5గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డక్‌ల రికార్డును భారత్‌ ఐదోసారి మూటగట్టుకుంది.

New Update
deedwews

Kohli-Rohit: స్వేదేశంలో న్యూజీలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఫేలవ ప్రదర్శన చేస్తోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో న్యూజీలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్(20) మినహా ఎవరూ రాణించలేదు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు పరుగులేమీ చేయకుండానే పెవిలీయన్ చేరారు. కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. దీంతో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డక్‌ల రికార్డును భారత్‌ ఐదోసారి మూటగట్టుకుంది.  

ఇది కూడా చదవండి: Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత రికార్డ్ క్రియేట్ చేసి భారత్!

ఇక 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లో 6గురు డకౌట్‌ అయ్యారు. ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా మొదటి ఏడుగురు బ్యాటర్లలో నలుగురు ఖాతా తెరవకుండా వెనుదిరగడం ఇది మూడోసారి. అంతేకాదు స్వదేశంలోనూ 10 పరుగులకే భారత్ మూడు వికెట్లను నష్టపోవడం ఇది 3వసారి. అన్నిసార్లూ కివీస్‌పైనే ఈ చెత్త రికార్డును దక్కించుకుంది. మొహాలీ వేదికగా 1999లో 7 పరుగులు, అహ్మదాబాద్‌ వేదికగా 2010లో 2 పరుగులకే టీమ్ ఇండియా 3 వికెట్లు సమర్పించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో డకౌట్ అయిన విరాట్.. భారత్ నుంచి అత్యధికసార్లు డక్ అయిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఇది కూడా చదవండి: IND vs NZ : భారత్ గడ్డపై 36 ఏళ్లుగా.. ఆ జట్టు విజయం కోసం ఎదురుచూపు

అత్యధిక డకౌట్లు:
43 - జహీర్ ఖాన్ 
40 - ఇషాంత్ శర్మ
38 - విరాట్ కోహ్లీ*
37 - హర్భజన్ సింగ్ 
35 - అనిల్ కుంబ్లే 
34 - సచిన్ టెండూల్కర్  
33 - రోహిత్ శర్మ*

ఇది కూడా చదవండి: పవర్ స్టార్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్

ఇదిలా ఉంటే.. భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి టెస్టుల్లో అత్యల్ప స్కోర్ కు ఆలౌటైంది. న్యూజీలాండ్ బౌలర్ల దెబ్బకు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు చేసింది. అయితే గతంలో స్వదేశంలో విండీస్‌పై (1987) 75 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక వీదేశాల్లో ఇంతకంటే తక్కువ స్కోర్ అడిలైడ్‌లో ఆసీస్‌ చేతిలో 36 రన్స్‌, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు.

ఇది కూడా చదవండి: Revanth: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. రేవంత్ సంచలన వ్యూహం!

Advertisment
Advertisment
తాజా కథనాలు