పవర్ స్టార్ టైటిల్ తో యాంకర్ ప్రదీప్ సినిమా.. ఆకట్టుకునేలా మోషన్ పోస్టర్

యాంకర్ ప్రదీప్ చాలా రోజుల తర్వాత రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సారి పవన్‌ కల్యాణ్‌ సినిమా టైటిల్‌పైనే కన్నేశాడు. ప్రదీప్ నటిస్తోన్న తాజా చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

New Update

బుల్లితెరపై తన యాంకరింగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ, నటుడిగా ప్రదీప్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత తన రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. కొన్ని నెలలుగా ప్రదీప్ బుల్లితెరపై కనిపించకపోవడానికే కారణం కూడా ఈ సినిమానే.

Also Read : 'బాహుబలి 3' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే?

పవన్ టైటిల్ తో..

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈసారి ప్రదీప్ పవర్ స్టార్ టైటిల్ పై కన్నేశాడు. అతని రెండో సినిమాకు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ నెట్టింటిని షేక్ చేస్తోంది. 

Also Read : 'పుష్ప 2' లో 'యానిమల్' విలన్.. సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడో?

ఓ వైపు అందమైన ఊరు, మరోవైపు ఆయుధాలు చేత బట్టిన గ్రామస్థులు, క్లాస్‌ రూంలో ప్రదీప్, ఇంట్లో హీరోయిన్‌ కనిపిస్తున్న విజువల్స్‌తో కట్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. మోషన్ పోస్టర్ ను బట్టి ఈ చిత్రం ప్రేమ కథ నేపథ్యంలో ఉండబోతుందని అర్థమవుతుంది. 

Also Read : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే

కాగా ఈ మూవీలో ప్రదీప్ మాచిరాజు సరసన యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె ఈ సినిమాతోనే వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. నితిన్ - భరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రధన్ సంగీతం అందిస్తున్నారు. మోంక్స్‌ అండ్ మంకీస్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది.  

Also Read : పుష్ప ఫ్యాన్ కు పూనకాలే.. అప్డేట్ అదిరిపోయింది..

Advertisment
Advertisment
తాజా కథనాలు