Jemimah Rodrigues: 12 ఏళ్లకే క్రికెట్ లోకి.. 16 ఏళ్లకే డబుల్ సెంచరీ.. జెమీమా రోడ్రిగ్స్‌ చిచ్చర పిడుగు

2000 సెప్టెంబర్ 5వ తేదీన మహారాష్ట్రలో జన్మించింది  జెమీమా రోడ్రిగ్స్‌.  ఆమె మాంగలోరియన్ క్రైస్తవ క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఆమెకు మొదటి కోచ్ , మెంటార్.

New Update
cricket

మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియా అదరగొట్టింది.సెమీస్‌లో ఆసీస్‌ పై అదిరిపోయే విక్టరీ కొట్టింది. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి మరీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ పాత్ర చాలా కీలకం..  ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన ఆసీస్‌పై 127 పరుగులతో జెమీమా అజేయంగా నిలిచి జట్టును ఫైనల్ కు చేర్చి జెమీమా రోడ్రిగ్స్‌ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో ఆమె ఎవరు.. ఆమె బ్యా్‌క్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడానికి నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

2000 సెప్టెంబర్ 5వ తేదీన మహారాష్ట్రలో జన్మించింది  జెమీమా రోడ్రిగ్స్‌.  ఆమె మాంగలోరియన్ క్రైస్తవ క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఆమెకు మొదటి కోచ్ , మెంటార్. ఆయన జెమీమా చదివిన పాఠశాలలో జూనియర్ కోచ్ గా  పనిచేశారు. ఆమె క్రికెట్ ఆడటం కోసం తన పాఠశాలలో బాలికల క్రికెట్ జట్టును స్థాపించారు. ఎనోచ్, ఎలీ. జెమీమా తన సోదరులకు బౌలింగ్ చేస్తూ పెరిగింది.చిన్నప్పటి నుండి, ఆమె కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, ఫీల్డ్ హాకీలో కూడా చాలా చురుకుగా ఉండేది. ఆమె సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ హై స్కూల్‌లో చదువుకుంది. తరువాత రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్‌లో తన డిగ్రీని అభ్యసించింది.

12 సంవత్సరాల వయస్సులోనే

జెమీమా రోడ్రిగ్స్‌ మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు కూడా ఎంపికైంది. క్రికెట్‌లో, ఆమె 12 సంవత్సరాల వయస్సులోనే మహారాష్ట్ర అండర్-19 జట్టులో అరంగేట్రం చేసింది. 16 ఏళ్ల వయసులోనే, 2017లో జరిగిన అండర్-19 దేశీయ టోర్నమెంట్‌లో సౌరాష్ట్ర జట్టుపై కేవలం 163 బంతుల్లో 202 నాటౌట్ పరుగులు చేసింది. స్మృతి మంధాన తర్వాత దేశీయ 50 ఓవర్ల క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారతీయ మహిళగా  జెమీమా రోడ్రిగ్స్‌ రికార్డు సృష్టించింది.

ప్రపంచకప్‌లలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, జెమీమా మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. గతంలో జట్టు నుంచి తొలగించబడినప్పుడు, ఆందోళన కారణంగా తాను ప్రపంచకప్‌ సమయంలో దాదాపు ప్రతిరోజూ ఏడ్చానని, కానీ తన కుటుంబం, స్నేహితులు, క్రైస్తవ విశ్వాసం తనకు బలం ఇచ్చాయని ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో వెల్లడించింది. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లలో ఆమె చేసే నృత్యాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరచుగా వైరల్ అవుతుంటాయి.  ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు దాదాపు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక గిటార్‌  వాయిస్తూ పాటలు పాడటం ఆమెకెంతో ఇష్టం. ఇన్‌స్టా వీడియోలు చూస్తే అర్థమైపోతుంది.

Advertisment
తాజా కథనాలు