ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. జపాన్‌ చిత్తు

అండర్-19 ఆసియాకప్‌ టోర్నీ రెండవ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా 339 పరుగులు చేయగా.. జపాన్ జట్టు 50 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

New Update
under 19 asia cup

అండర్ 19 ఆసియా కప్ టోర్నీ ఇటీవల ప్రారంభం అయింది. భారత్- పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మొదటి మ్యాచ్‌లో భారత్ 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఓటమితో ప్రచారాన్ని ప్రారంభించిన యువ భారత్.. ఇప్పుడు ఊహకందని భారీ విజయాన్ని సాధించింది. 

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

షార్జా వేదికగా ఇవాళ రెండో మ్యాచ్ జరిగింది. భారత్- జపాన్ మధ్య జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ కొట్టింది. దాదాపు 6 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ చేసింది. 339 పరుగులు చేసి జపాన్‌కు చెమటలు పట్టించింది. ఇక ఈ రన్స్ ఛేదించే క్రమంలో జపాన్ జట్టు చిత్తు చిత్తు అయింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

టాస్ ఓడిపోయిన టీమిండియా..

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌ దిగిన ఓపెనర్లు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే మంచి ఆరంభం అందించారు. వీరిద్దరూ దాదాపు 7 ఓవర్లలో 65 రన్స్‌తో పాట్నర్‌షిప్‌ను నెలకొల్పారు. అనంతరం వైభవ్ 23 బంతుల్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. అయినా ఆయుష్ మాత్రం తన ఆటను ఫుల్ ఫైర్‌లో ఉంచాడు. 29 బంతుల్లో 54 రన్స్ చేసి అదరగొట్టేశాడు. 

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

ఆ తర్వాత 81 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. ఇక ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలన్న కసితో టీమిండియా కెప్టెన్ మహ్మద్ అమన్ ముందడుగు వేశాడు. దీంతో మూడో వికెట్‌కు ఆండ్రీ సిద్దార్థ్‌తో 58 రన్స్, కేపీ కార్తికేయతో 4వ వికెట్‌కు122 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇలా మొత్తం 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేశారు. 

Advertisment
తాజా కథనాలు