2వసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న ఇటలీ ఆటగాడు

ఆస్ట్రేలియా ఓపెన్స్ 2025 పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ ఇటలీకి చెందిన యానిక్ సినర్ కైవసం చేసుకున్నాడు. 23ఏళ్ల  డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ ఈ గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవడం వరుసగా ఇది రెండోసారి. సినర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.

author-image
By K Mohan
New Update
Australian Open 2025

Australian Open 2025 Photograph: (Australian Open 2025)

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జనవరి 26న జరిగింది. 23ఏళ్ల  డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇటలీకి చెందిని సినర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండవసారి టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో జర్మనీ ఆటగాడైన అలెగ్జాండర్ జ్వైరెవ్‌ను 6-3, 7-6, 6-3 పాయింట్ల తేడాతో సినర్ ఓడించాడు. దీంతో ఆస్ట్రేలియా ఓనెన్ గ్రాండ్‌స్లామ్ వరుసగా రెండుసార్లు గెలుచుకున్న నాలుగో ఆటగాడిగ యానిక్ సినర్ నిలిచాడు.

సెమీఫైనల్లో లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ గాయంతో వాకోవర్ ఇవ్వడంతో ఫైనల్ చేరిన జర్మనీ ఆటగాడు జ్వెరెవ్... డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్ ముందు ఏమాత్రం నిలవలేకపోయాడు. జ్వెరెవ్ రెండో సెట్ లో మాత్రం కాస్తంత పోటీ ఇచ్చినా, టైబ్రేకర్ లో ఆ సెట్ ను చేజార్చుకున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు