/rtv/media/media_files/2025/02/01/1VwDJRSrV9u9Z9GXqzli.jpg)
Wriddhiman Saha announces his retirement from all cricket formats
Wriddhiman Saha
భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు అధికారికంగా రెటైర్మెంట్ ప్రకటించారు. ఫిబ్రవరి 1, 2025న ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తన 17 ఏళ్ల కెరీర్‌ను హృదయపూర్వక వీడ్కోలతో ముగించాడు. టీమిండియా జట్టులో ప్రతిభావంతుడైన కీపర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. కాగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఈ 40 ఏళ్ల వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ తన చివరి బ్యాటింగ్ ఇన్నింగ్స్ డకౌట్‌తో ముగించాడు.
Thank You, Cricket. Thank You everyone. 🙏 pic.twitter.com/eSKyGQht4R
— Wriddhiman Saha (@Wriddhipops) February 1, 2025
మొహమ్మద్ షమీ రియాక్ట్
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
వృద్ధిమాన్ సాహా రిటైర్మెంట్‌పై భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ స్పందించారు. “ఈ రోజు మనం భారత క్రికెట్ నిజమైన లెజెండ్ వృద్ధిమాన్ సాహాకు వీడ్కోలు పలుకుదాము. అతని అద్భుతమైన గ్లోవ్ వర్క్, మైదానంలో లెక్కలేనన్ని చిరస్మరణీయ క్షణాలు చెరగని ముద్ర వేశాయి”అని పేర్కొన్నారు.
ఎంతో అద్భుతమైన ప్రయాణం
ఈ మేరకు వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘‘1997లో నేను తొలిసారి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టి 28 సంవత్సరాలు అయింది. అది ఎంతో అద్భుతమైన ప్రయాణం! నా దేశం, రాష్ట్రం, జిల్లా, క్లబ్‌లు, విశ్వవిద్యాలయం, కళాశాల, పాఠశాలకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవం.
నేను ఈ రోజు ఉన్నదంతా, ప్రతి విజయం, నేర్చుకున్న ప్రతి పాఠం. ఇవన్నీ ఈ అద్భుతమైన ఆటకు నేను రుణపడి ఉన్నాను. క్రికెట్ నాకు అపారమైన ఆనంద క్షణాలను, మరపురాని విజయాలను, అమూల్యమైన అనుభవాలను ఇచ్చింది. ఇది నన్ను పరీక్షించింది. ఎత్తుపల్లాలు, విజయాలు, ఎదురుదెబ్బల ద్వారా, ఈ ప్రయాణం నన్ను నేనుగా మార్చింది.
కానీ అన్ని విషయాలు చివరికి ముగియాలి కాబట్టి, నేను అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. నా కుటుంబం, స్నేహితులతో ఆనంద క్షణాలను అనుభవించాలనుకుంటున్నాను.’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Also Read :వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?
కాగా సాహా IPLలో KKR, SRH, GT, పంజాబ్‌కు ఆడాడు. 40 టెస్టుల్లో 1,353 పరుగులు చేశాడు. 9 ODIల్లో 41, 122 FC మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.