Fourth Test: అద్భుతంగా ఆడేశారు..నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా

ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను డ్రా చేశారు. టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముందు ఇంగ్లాండ్ తల వంచక తప్పలేదు. కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, సుందర్ సెంచరీలతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించారు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. 

New Update
test draw

Fourth Test Draw

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బ్యాటర్లు వీరోచిత పోరాటంతో ఓటమి నుంచి గట్టెక్కించారు. కెప్టెన్ శుబ్ మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

పది ఓవర్లు ఉండగానే..

రవీంద్ర జడేజా 185 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 103 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులతో సెంచరీలు చేసి భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు. అంతకు ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్  12 ఫోర్లతో 103 పరుగులు కూడా చేశాడు. కేఎల్ రాహుల్  230 బంతుల్లో 8 ఫోర్లతో 90 పరుగులు చేసి సెంచరీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 425/4. సుందర్ సెంచరీ చేసిన తర్వాత మ్యాచ్‌ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఫలితం తేలే లేదని..ఇంకా పది ఓవర్లు ఉండగానే అంపైర్లు డ్రాగా ప్రకటించారు. 

Advertisment
తాజా కథనాలు