Team India ODI captain: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నియమితులయ్యారు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు పగ్గాలు అప్పగించారు. ఈ సిరీస్ అక్టోబర్ 19న ఆస్ట్రేలియాలో ప్రారంభమవుతుంది.

New Update
Team India ODI captain announced Shubman Gill Against australia

Team India ODI captain announced Shubman Gill Against australia


భారత క్రికెట్‌లో కెప్టెన్సీ విషయంలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. ఎంతో కాలంగా వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు పగ్గాలు అప్పగిస్తూ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. మరీ ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని బీసీసీఐ ఈ సంచలన మార్పు చేసినట్లు తెలుస్తోంది. 

2027 ప్రపంచకప్ వ్యూహం

25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ను అన్ని ఫార్మాట్‌లకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో.. గిల్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా గిల్‌కి అప్పగించడం ద్వారా.. భారత క్రికెట్‌కు ఒకే కెప్టెన్ విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. కాగా గిల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

తన బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్‌ కొనసాగిస్తూ నిలకడైన ఆటతీరుతో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. అతడి యువ నాయకత్వం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

రోహిత్, కోహ్లీ స్పెషలిస్ట్ బ్యాటర్లు

అక్టోబర్ 19 నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5టీ20 లు ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారు. అయితే వీరు కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్లుగా మాత్రమే ఆడతారు. దీంతో యువ సారథి గిల్.. వీరి అనుభవాన్ని ఉపయోగించుకుని జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి.

Advertisment
తాజా కథనాలు