IPL Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్ బై.. తప్పుకోవడానికి జట్టులో ఉన్న అతనే కారణమా?

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. సంజు శాంసన్ వల్ల రాహుల్ ద్రవిడ్‌ని ఫ్రాంచైజీ తప్పించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

New Update
Rahul Dravid

Rahul Dravid

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవి నుంచి తప్పుకున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. అయితే రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా గతేడాది నియమితులయ్యారు. కేవలం ఒక్క సీజన్ తర్వాత అతను ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  గతంలో రాయల్స్‌కు కెప్టెన్‌గా, ఆటగాడిగా, మెంటార్‌గా కూడా ద్రవిడ్ పని చేశారు. అయితే ద్రవిడ్ కేవలం ఒక్క సీజన్ తర్వాత హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ పేలవమైన ప్రదర్శన చేసిందని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: RCB Compensation: ఆర్సీబీ సంచలన నిర్ణయం..వారికి రూ.25 లక్షల ఆర్థికసాయం

అతని వల్లే రాజీనామా..

ద్రవిడ్ కోచ్‌గా ఉన్న 2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఆడింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ద్రవిడ్ తన కోచింగ్ స్టాఫ్‌లోకి విక్రమ్ రాథోర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకువచ్చినా, జట్టు ప్రదర్శనలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ద్రవిడ్ భారత జట్టు ఎన్నో విజయాలను సాధించడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈ క్రమంలోనే అతనిపై ఫ్రాంచైజీ అంచనాలు పెట్టుకుంది. కానీ వాటిని ద్రవిడ్ అందుకోలేకపోవడమే జట్టును విడనాడటానికి కారణమని తెలుస్తోంది. దీంతో పాటు జట్టులో ఓ ఆటగాడి వల్ల ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 

జట్టు మేనేజ్‌మెంట్ కెప్టెన్ సంజూ శాంసన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. చివరకు జట్టు శాంసన్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుందని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ద్రవిడ్ వెళ్లిపోతే శాంసన్ 100% జట్టులో ఉంటాడని అంటున్నారు. అయితే దీనిపై ద్రవిడ్, సంజూ శాంసన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న కుమార్ సంగక్కర మళ్లీ రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Asia Cup 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆసియా కప్ షెడ్యూల్‌లో మార్పు.. కారణమిదే!

Advertisment
తాజా కథనాలు