/rtv/media/media_files/2025/03/08/Mo6L1w8tbBuJHBCwl5QM.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఇక దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలిచి న్యూజిలాండ్ ఫైనల్ లో చోటు సంపాదించింది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
భయపెడుతున్న ఆదివారం!
అయితే అభిమానులను ఆదివారం సెంటిమెంట్ భయపెడుతుంది. ఎందుకంటే ఐసీసీ టోర్నీ చరిత్రలో భారత్ ఆదివారం రోజున ఆడిన ఫైనల్లో ఏ ఒక్కటి కూడా గెలవకపోవడమే. భారత్ ఇప్పటివరకూ రెండు వన్డే ప్రపంచకప్ లు, రెండు టీ20 ప్రపంచకప్ లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచింది. అయితే ఇవన్నీ ఆదివారం కాకుండా ఇతర రోజుల్లో జరిగాయి. ఇక భారత్ ఓడిన 2003, 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లు ఆదివారం రోజునే జరిగాయి. అంతేకాకుండా 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోయింది. 2000, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓడిపోగా అవి కూడా ఆదివారాల్లోనే జరిగాయి. ఇప్పటివరకూ ఆదివారం రోజు జరిగిన ఐసీసీ టోర్నీ ఫైనల్లో భారత్ గెలవకపోవడం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. అయితే ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేస్తోందని మరికొంతమంది అభిమానుులు నమ్ముతున్నారు.
జట్ల అంచనా
న్యూజిలాండ్ : మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.
Also Read : పుచ్చకాయలు పిచ్చి పిచ్చిగా తింటున్నారా.. ఇది తెలిస్తే పుచ్చలేసిపోద్ది!!