Sanju Samson: ‘నేను దేనికైనా రెడీ’.. సంజు సామ్సన్ సంచలన ప్రకటన..

టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ తన బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. CEAT అవార్డుల వేడుకలో మాట్లాడాడు. ‘‘నా దేశం కోసం ఆడటం నాకు చాలా గర్వంగా ఉంది. వారు నన్ను 9వ స్థానంలో బ్యాటింగ్ చేయమని అడిగినా నేను జట్టు కోసం అలా చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు.

New Update
Sanju Samson Sensational announcement

Sanju Samson Sensational announcement

భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ సంజు సామ్సన్ T20 ఫార్మాట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ వంటి మ్యాచ్‌లలో అతడి పేరు మారుమోగిపోయింది. అతడు T20 ఫార్మాట్‌లో నిలకడైన ఓపెనర్‌గా ఆడుతూ పరుగులు సాధించాడు. అయినప్పటికీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను ఛేంజ్ చేశారు. దీంతో ఇటీవల జరిగిన ACC ఆసియా కప్ 2025 లో సామ్సన్ 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఇప్పుడు సంజు తన బ్యాటింగ్ ఆర్డర్‌ గురించి ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. అతడి ప్రకటన అందరినీ షాక్ కు గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Sanju Samson Sensational announcement

భారత్ త్వరలో ఆస్ట్రేలియాతో ODI, T20 సిరీస్‌లు ఆడబోతుంది. ఇందులో భాగంగా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ T20 జట్టులోకి తిరిగి రావడంతో.. సంజు సామ్సన్ బ్యాటింగ్ స్థానాన్ని మార్చారు. మరోవైపు అభిషేక్ శర్మ స్థానం ఇప్పటికే ఖాయంగా అనిపించింది. ఇక ఇటీవల ACC ఆసియా కప్ 2025 సమయంలో సంజు 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఈ సందర్భంగా సంజు తాజాగా CEAT అవార్డుల కార్యక్రమంలో తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడాడు. సామ్సన్ ఇలా అన్నాడు.. ‘‘నా దేశం కోసం ఆడటం నాకు చాలా గర్వంగా ఉంది. వారు నన్ను 9వ స్థానంలో బ్యాటింగ్ చేయమని అడిగినా నేను జట్టు కోసం అలా చేస్తాను.’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అతడి ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది.  

ఇంకా అతడు మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. సంజు సామ్సన్‌తో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా CEAT అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. 2024 T20 ప్రపంచ కప్ విజయం గురించి అడిగినప్పుడు సంజు మాట్లాడుతూ.. ‘‘విజయానికి ఫార్ములాను కనుగొనడానికి 16 సంవత్సరాలు పట్టింది. రోహిత్ భాయ్ కి ధన్యవాదాలు.’’ అని తెలిపాడు. ఇదిలా ఉంటే ACC ఆసియా కప్ 2025లో సంజు సామ్సన్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్ట సమయాల్లో మరీ ముఖ్యంగా ఫైనల్ మ్యా్చ్‌లో తిలక్ వర్మకు మంచి భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. సంజు ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో ఆడబోతున్నాడు. 

Advertisment
తాజా కథనాలు