Tamim Iqbal: తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. డాక్టర్ ఏమన్నారంటే?

ఇటవల గుండెపోటుకు గురైన బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కోలుకుంటున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు అతడు కఠినమైన డైట్‌ను ఫాలో అవ్వాలని డాక్టర్ షాబుద్దీని పేర్కొన్నారు.

New Update
Tamim Iqbal discharged

Tamim Iqbal discharged

Tamim Iqbal discharged

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తాజాగా అతడు హాస్పిటల్ నుంచి కోలుకున్నాడు. యాంజియోప్లాస్టీ చేయించుకున్న తమీమ్ ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ.. తమీమ్ సాధారణ స్థితికి రావడానికి అతడు తన జీవనశైలి మార్చుకోవాలని అని అన్నారు. 

Also Read: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

అంతేకాకుండా కఠినమైన డైట్‌ను అనుసరించాల్సి ఉంటుందని డాక్టర్ షాబుద్దీని పేర్కొన్నారు. అదే సమయంలో హెల్త్ మినిస్టర్ అబు జాఫర్ మాట్లాడారు. తమీమ్ గ్రౌండ్‌లోకి తిరిగి రావడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా స్మోకింగ్ మానుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

ఏం జరిగింది?

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా అతడు సోమవారం మ్యాచ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తమీమ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈసీజీ, తదితర స్కానింగ్స్‌ చేయించారు. అయితే తమిమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

తమిమ్‌కు ఇప్పటికే రెండుసార్లు గుండెపోటు వచ్చినట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్‌ మెడికల్‌ అధికారి దేబాశిస్ చౌదరి అన్నారు. అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. అయితే తమిమ్‌ను మొదటగా ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ అతని ఆరోగ్య పరిస్థితి వల్ల స్థానిక ఆస్పత్రికే తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

ఇదిలాఉండగా తమిమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ టీమ్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20 మ్యాచుల్లో ఆడాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 15 వేల కన్నా ఎక్కువగా పరుగులు చేశాడు. తమిమ్‌కు గుండెపోటు రావడంతో క్రికెట్‌ అభిమానులు షాకైపోయారు. అతను త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.   

( tamim-iqbal | latest-telugu-news | telugu-news | sports-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు