/rtv/media/media_files/2025/04/23/w7z34Bqw1ZYkmzIA5Z41.jpg)
Klassen
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ క్లాసెన్ చెలరేగిపోయాడు. ఆ జట్టు బ్యాటర్లందరూ చేతులెత్తేసినా.. అతడు మాత్రం అదరగొట్టేశాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కష్టకాలంలో టీంకు వెన్నెముఖగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
Klassen
మూడు ఓవర్లకే సన్‌రైజర్స్ జట్టు బలమైన 2 వికెట్లు కోల్పోయింది. పోనీ తర్వాత వచ్చిన బ్యాటర్లైనా ఆడుతారు అనుకుంటే వారు కూడా చేతులెత్తేశారు. దీంతో 9 ఓవర్లకు SRH జట్టు 5 వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేసింది. ఒకానొక సమయంలో 100 పరుగులు అయినా చేస్తుందా? అనే డౌట్ అందరిలోనూ కలిగింది. కానీ క్లాసెన్ తన క్లాసిక్ బ్యాటింగ్‌తో పరుగుల వరద పెట్టించాడు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
ఎవరున్నా లేకున్నా తనకేం సంబంధం లేదన్నట్లుగా ఆట ఆడాడు. ఒక్కడే ఉన్నా.. అదరలేదు బెదరలేదు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వరుస వికెట్లు పడగొట్టిన ముంబై బౌలర్లకు చెమటలు పెట్టించాడు. ఒక్కడే ఉండి పరుగులు రాబట్టాడు. ఇక క్లాసిన్‌కి అభినవ్ తోడవడంతో బలమైన భాగస్వామ్యం కుదిరింది.
ఇద్దరూ కలిసి చెండాడేశారు. దీంతో క్లాసిన్ 44 బంతుల్లో 71 పరుగులు రాబట్టి దుమ్ము దులిపేశాడు. అదే సమయంలో అభినవ్ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు 143 పరుగులు చేసింది.
IPL 2025 | srh-vs-mi | IPL 2025 SRH vs MI Live Score